సమ్మర్ సీజన్ స్పెషల్ డ్రింక్: ఇది ఒక్క గ్లాస్ తాగితే నీరసమే ఉండదు.. 100 ఏనుగుల బలం వచ్చేస్తుంది..!

జనాలను భయపెట్టే ఎండాకాలం వచ్చేసింది ..బయట సూర్యుడు భగభగ మండిపోతున్నాడు ..ఉదయం తొమ్మిది దాటితే చాలు కాళ్లు తీసి బయట పెట్టాలి అంటే గజగజ వణికి పోతున్నారు జనాలు . మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో సూర్యుడు ఎంత చిటపటా మండిపోతున్నాడో చూస్తున్నాం . అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటేనే వద్దురా బాబు అనిపించే పొజిషన్స్ కనిపిస్తున్నాయి . అయితే కొన్ని కొన్ని వృత్తుల్లో ఉండే వాళ్ళు బయట తిరగాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. మనం కూడా కాయగూరలు కొనుక్కోవడానికి ఇతర వస్తువులు కొనుక్కోవడానికి కచ్చితంగా రోజులో ఒక్కసారైనా బయటకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది.

అయితే అలా బయటకు వెళ్లాల్సిన సమయంలో వయస్సు పై బడిన వాళ్ళకంటే యంగ్ గా ఉండే వాళ్లే బయటకు వెళ్లడం మంచిది అంటున్నారు డాక్టర్లు. అంతేకాదు బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా గొడుగు ని తీసుకొని వెళ్ళాలి అంటూ సజెస్ట్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా బాటిల్లో నీళ్లు కూడా పట్టుకొని వెళ్లడం చాలా చాలా మంచిది అంటున్నారు . అంతేకాదు ఈ వేడికి చెమట ఎక్కువగా పోతూ ఉంటుంది . బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్ గా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది . అది చిన్నపిల్లలు అయినా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఈ ఎండాకాలం బాడీ డిహైడ్రేట్ అయితే చాలా చాలా డేంజర్ .

అందుకే ఈ స్పెషల్ డ్రింక్ తాగమంటూ సజెస్ట్ చేస్తున్నారు పలువురు డాక్టర్లు. మరీ ముఖ్యంగా కొంతమంది ఈ ఎండాకాలం సాఫ్ట్ డ్రింక్స్ తాగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. బయటకు వెళ్ళామంటే షాపులో ఏదో ఒక కూల్ డ్రింక్ కొనుక్కొని తాగేస్తూ ఉంటారు. అయితే అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంటూ చెప్పుకొస్తున్నారు . ఇంట్లోనే చక్కటి హెల్తీ డ్రింక్ రెడీ చేసుకోవచ్చు అంటున్నారు.

కొంచెం పెరుగు తీసుకొని అందులో స్పూన్ జీలకర్ర ..ఒక పచ్చిమిర్చి కట్ చేసుకుని .. అలాగే గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర ఆకులను సన్నగా కట్ చేసుకుని ..చిటికెడు అంటే చిటికెడు పసుపు.. కొంచెం అల్లం ముక్క వేసి మిక్సీ పట్టుకొని రెండు ఐస్ క్యూబ్స్ గ్లాస్ లో వేసుకొని ఆ మిశ్రమాన్ని ఐస్ క్యూబ్ వేసుకున్న గ్లాసులో పోసి తాగితే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అని బాడీ కూల్ అవుతుంది అని ..ఎటువంటి నష్టం లేకుండా హెల్త్ కి చాలా చాలా బెనిఫిట్స్ కలిగిస్తుంది అని చెప్పుకొస్తున్నారు .

అంతేకాదు రోజుకి రెండు మూడు సార్లు ఈ డ్రింక్ తాగినా కూడా పుష్టిగా ఉంటామని ..మన బాడీ ఎనర్జీ లెవల్స్ ఎక్కడ తగ్గవు అని.. దీనితో పాటు హెల్తీ ఫుడ్ డైట్ ఫాలో అయితే కచ్చితంగా 100 ఏనుగుల బలం మన సొంతం అవుతుంది అని డాక్టర్ లు చెప్పుకు వస్తున్నారు..!