ఆ ఒక్క పనితో అందరి నోర్లు మూయించిన మెగా డాటర్.. ఇక చచ్చిన ఎవ్వడు ఆ మాట అనలేడు..!

సోషల్ మీడియాలో మెగా డాటర్ శ్రీజ ని ఏ రేంజ్ లో ట్రోలింగ్ చేసి ఆటాడేసుకుంటూ ఉంటారో మెగా హేటర్స్ మనకు తెలిసిందే. ఆ అన్న ఊ అన్న ఎటు తిరిగినా సరే మెగా డాటర్ శ్రీజా విడాకులకు లింక్ పెడుతూ ఆమెను దారుణాతి దారుణమైన పదాలతో ట్రోల్ చేస్తూ ఉంటారు . ఈ విషయం మనందరికీ తెలిసిందే . ఆమె టైం బాగోలేదు అన్నట్లు శ్రీజ విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక కూడా విడాకులు తీసుకోవడం శ్రీజ పాలిట పెద్ద శాపంగా మారింది .

నిహారిక పేరు చెప్పి కూడా శ్రీజను చాలా సార్లు ట్రోల్ చేశారు . అయితే ఈ ట్రోల్లింగ్ లోనే చాలామంది రెండు పెళ్లిళ్లు చేసుకున్నావ్ .. ఇద్దరు మొగుళ్ళకు విడాకులు ఇచ్చేసావ్ ..నువ్వు చిరంజీవి పై ఆధారపడతావా ..నీ కాళ్ళ మీద నువ్వు నిలబడలేవా ..? అంటూ దారుణాతి దారుణమైన పదాలతో ట్రోల్ చేశారు. ఆ మాటలు విన్నిందో .. లేకపోతే శ్రీజా కే నా కాళ్ళపై నేను నిలబడాలి అన్న ఆలోచన వచ్చిందో ..? రీసెంట్గా ఆమె ఓ మంచి నిర్ణయం తీసుకుంది .

దానికి సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . మెగా డాటర్ గా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీజ కొత్త బిజినెస్ ప్రారంభించింది . దీనికి సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులకు గుడ్ న్యూస్ అందజేసింది . సోషల్ మీడియాలో కొంతమంది శ్రీజా చేసిన పనికి అప్రిషియేట్ చేస్తుంటే ..మరి కొంతమంది దీనిలో కూడా ద్వంద అర్ధాలు తీస్తూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

శ్రీజ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది . “ఇది ఒక అద్భుతమైన ప్రయాణం ఇందులో నేను జాయిన్ అయినందుకు చాలా ధ్రిల్లింగ్ గా ఉంది” అంటూ హైదరాబాద్లో అనంత స్టూడియో పేరుతో ఓ ఫిట్నెస్ సెంటర్ను ప్రారంభించింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి . ఇకపై శ్రీజను ఎవ్వరు కూడా వేలెత్తి చూపించే విధంగా చేసుకోకుండా తన కాళ్లపై తాను నిలబడాలి అనుకుంటుంది శ్రీజ..!!