ఎండాకాలంలో ఎక్కువగా నైటీలు వేసుకుంటున్నారా..? అయితే ఈ పని మాత్రం అస్సలు చేయకండి.. ఎందుకంటే..?

ప్రతి హస్బెండ్ కి ఆడవాళ్ళ దగ్గర ఉన్న కామన్ ప్రాబ్లం నైటీలు . మన ఇళ్లల్లో చాలా మంది కూడా ఇలాంటి సిచువేషన్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు. ఇలాంటి టాపిక్ ఎప్పుడో ఒకసారి ఎక్కడ ఒకచోట వచ్చే ఉంటుంది . చాలామంది హౌస్ వైఫ్ లు ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా నైటీలు వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు . వాళ్ళ కంఫర్టబుల్ వాళ్ళు చూసుకోవడానికి ఈ విధంగా నైటీలను అలవాటు చేసుకుంటూ ఉంటారు . మరి ముఖ్యంగా ఒకపట్లో ఈ నైటీలు అనేటివి కేవలం రాత్రి సమయంలోనే వేసుకునేవారు . కానీ ఇప్పుడు అలా కాదు పండగ అయిన పబ్బం అయినా.. స్నానం చేయగానే ముందు ఆడవాళ్లు ఈ నైటీనే వేసుకుంటున్నారు.. వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు.. దానికి కారణాలు ఎన్నైనా ఉండొచ్చు.

కానీ అలా ఇంట్లో ఆడవాళ్లు ఎక్కువగా నైటీ వేసుకుని తిరగడం అంత మంచిది కాదు అంటున్నారు పెద్దవాళ్ళు. మరీ ముఖ్యంగా కొంతమంది నైటీలు రకరకాలుగా వాడేస్తూ ఉంటారు . మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సమ్మర్ సీజన్లో ..బయట పెరిగిపోతున్న వేడికి ఉక్కపోత తట్టుకోలేక ఎక్కువగా ఆడవాళ్లు కాటన్ నైటీని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు అదే నైటీతో తిరుగుతూ ఉంటారు . అయితే ఈ సమ్మర్ కి ఎలా చెమట పోస్తుంది అనే విషయం అందరికీ తెలిసిందే .

ఆడవారు కిచెన్లో వంట చేస్తూ ఉంటారు . వాళ్ళకి ఇంకా సెగకి చెమటలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి . అయితే అదే నైటీతో అన్ని పనులు చేస్తూ కిచెన్ లో చెమట తుడుచుకుంటూ.. పాత్రలు క్లీన్ చేస్తూ అదే విధంగా నైటీని ఎక్కువసార్లు ఉపయోగిస్తూ చేతులు తుడుచుకుంటూ .. అదే చేతులతో మళ్ళీ అన్నం తింటూ కొన్ని కొన్ని సార్లు మనకు తెలియకుండా మనమే తప్పులు చేసేస్తూ ఉంటాము..

దానివల్ల ఈ చెమటికి బ్యాక్టీరియా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది . ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడైతే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి . అందుకే ఆడవాళ్లు నైటీని ఎక్కువగా వాడకపోవడమే మంచిది అంటున్నారు పెద్దవాళ్లు . ఒకవేళ అలా కంఫర్టబుల్ కోసం వాడాల్సివస్తే ఖచ్చితంగా రోజుకి మూడు నైటీలు అయినా మార్చుకోవాలి అంటూ సజెస్ట్ చేస్తున్నారు. చెమట ఎక్కువగా పోస్తున్నప్పుడు అదే చెమటతో ఎక్కువసేపు ఒకే దుస్తుల్లో ఉంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి..!!