కల్కి విషయంలో బిగ్ మిస్టేక్ చేసిన నాగ్ అశ్వీన్..కొంప ముంచేశావ్ కదా బ్రో(వీడియో)..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా కల్కి 2898 ఏడి . ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి అప్డేట్ రిలీజ్ అయినా సరే ఫాన్స్ ఓ రేంజ్ లో సంబరపడిపోతారు. బాగా ట్రెండ్ చేస్తూ ఉంటారు . తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక స్పెషల్ వీడియోని రిలీజ్ చేసింది చిత్రం బృందం .

కల్కి 2898 ఏడి సినిమా లో అమితాబచ్చన్ నటిస్తున్న విషయం తెలిసిందే . ఆయనకు సంబంధించిన లుక్ ను ఈరోజు విడుదల చేశారు . దీనికి సంబంధించి స్పెషల్ గ్లింప్స్ వీడియో వైరల్ గా మారింది . ఇందులో ఆయన అశ్వత్ధామ గా కనిపించబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు అమితాబచ్చన్ లుక్స్ సినిమాకి హైలైట్ గా మారబోతుంది అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో జనాలు ఓ రేంజ్ లో వైరల్ చేస్తున్నారు .

నిన్న మొన్నటి వరకు కల్కి సినిమాకి సంబంధించి కేవలం ప్రభాస్ మాత్రమే హైలెట్గా నిలిచారు . కానీ తాజా పోస్టర్ లో అమితాబచ్చన్ క్రెడిట్ కొట్టేశాడు. ప్రభాస్ను వెనక్కి నెట్టేసాడు . దీంతో రెబల్ ఫాన్స్ మండిపడుతున్నారు . సినిమాలో ప్రభాస్ లుక్ కన్నా అమితాబచ్చన్ లుక్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినట్లు ఉన్నావు నాగ్ అశ్వీన్ బ్రో..? అందుకే ఆయనకు ఇలాంటి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చావ్. సినిమాకి హీరో ప్రభాసా..? అమితాబచ్చనా..? తప్పు చేశావు బ్రో. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ మండిపడుతున్నారు. మరికొందరు సినిమాని సినిమాగా చూడండి అంటున్నారు. మొత్తానికి నాగ్ అశ్వీన్ తెలిసి చేశాడో తెలియక చేసాడో తెలియదు కానీ ప్రభాస్ అభిమానులు మాత్రం హర్ట్ చేసేసాడు..!