బిగ్ షాకింగ్: విడాకులు తీసుకున్న మరో స్టార్ జంట.. ఫ్యాన్స్ కన్నీరు..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న వార్తలను మనం ఎక్కువగా వింటున్నాం . మరీ ముఖ్యంగా టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న సెలబ్రిటీస్ విడాకులు తీసుకుంటూ ఉండడం గమనార్హం. రీసెంట్గా టాలీవుడ్కు చెందిన సినిమా ఆటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్ తన భార్యతో విడాకులు తీసుకున్న విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు .

దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. 2020లోనే మంజు నుండి విడిపోయాను అంటూ బిగ్ బాంబు పేల్చాడు సినిమా ఆటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్ . ఈ మధ్యనే విడాకుల ప్రక్రియ కూడా పూర్తయింది అంటూ అభిమానులు గుండెలు బద్దలైపోయే న్యూస్ను బయటపెట్టారు . కానీ మంజు ఇప్పటికీ నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చాడు.

ఆయన మాట్లాడుతూ..” మేం విడిపోయిన ఆమెను నేను స్నేహితురాలుగా పిలవాలి అనుకుంటున్నాను .. ఎందుకంటే మా మధ్య మంచి స్నేహబంధం ఉంది.. విడిపోయాక మంజు కెరియర్ సక్సెస్ఫుల్గా సాగుతుంది అని ఆశపడుతున్నాను.. ఆమె లైఫ్ లో మంచిగా సెటిల్ అయితే నాకన్నా ఆనందించే వాళ్ళు మరొకరు ఉండరు “అంటూ చాలా చాలా ఎమోషనల్ గా స్పందించాడు.

ప్రజెంట్ న్యూస్ సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . తెలుగులో నాలుగు సినిమాలకు సినిమా ఆటోగ్రాఫర్ గా వర్క్ చేసిన సుజిత్ ఆ తర్వాత మలయాళీ నటి మంజు పిళ్లై ని పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . వీరికి ఒక పాప కూడా ఉంది. వీరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!!