విజయ్ దేవరకొండ పై నెగిటివ్ ప్రచారం చేస్తుంది ఆ హీరో నా..? ఇండస్ట్రీనీ షేక్ చేస్తున్న న్యూస్..!

గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో హీరో విజయ్ దేవరకొండకు సంబంధించిన ట్రోలింగ్ ఏ రేంజ్ లో జరుగుతుందో మనం చూసాం. సినిమా ఇండస్ట్రీలో హీరోగా వచ్చిన తర్వాత ట్రోల్లింగ్ సర్వసాధారణమే.. అయితే ప్రతి విషయంలోనూ ఓ హీరోని టార్గెట్ చేస్తూ వచ్చారు కొందరు జనాలు. ఆ హీరో మరెవరో కాదు. విజయ్ దేవరకొండ.

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా ట్యాగ్ చేయించుకున్న విజయ్ దేవరకొండ తాజాగా నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్ . ఏప్రిల్ 5వ తేదీ రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ ను అందుకుంది . ఈ సినిమా కోసం భారీ స్థాయిలో కష్టపడ్డాడు విజయ్ దేవరకొండ. కానీ ఫలితం అందుకోలేకపోయింది . విజయ్ దేవరకొండ ఫాన్స్ ను ఈ సినిమా మెప్పించలేకపోయింది. అయితే ఇదే మూమెంట్లో కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ పర్సనల్ విషయాలను కూడా ట్రోల్ చేశారు .

హద్దులు మీరి పోయే రేంజ్ లో బూతు పదాలను వాడారు . దీంతో ఫ్యామిలీ స్టార్ చిత్ర బృందం అలాగే కొంతమంది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సైబర్ క్రైమ్ ని ఆశ్రయించారు . అయితే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఓ విషయాన్ని గట్టిగా ట్రెండ్ చేస్తున్నారు . విజయ్ దేవరకొండ పై ట్రోలింగ్ చేయించడం వెనుక స్టార్ హీరో హస్తం ఉంది అంటూ అభిప్రాయపడుతున్నారు. మొదటి నుంచి ఆ హీరోకి విజయ్ దేవరకొండ అంటే ఇష్టం లేదు అని.. పలు ఇంటర్వ్యూలలో ఆ విషయాన్ని ఓపెన్ గానే చెప్పుకు వచ్చేసాడు అని.. ఈ ట్రోలింగ్ అంతటికి కారణం ఆ హీరోనే అంటూ మాట్లాడుకుంటున్నారు. ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది..!!