“సిగ్గు లేదా రా మీకు..?”.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్..!

టెక్నాలజీ పెరిగిపోవడంతో ప్రపంచం ముందుకు వెళ్ళిపోతుందా ..? అని ఆనందపడాలో ..లేకపోతే టెక్నాలజీ పెరిగిపోయి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ఫేక్ గా మారుతూ ఉండడంతో బాధపడాలో తెలియని అయోమయ సిచువేషన్ నెలకొంది. సోషల్ మీడియా అందుబాటులోకి రావడం అందరికీ ఉపయోగకరమే . అయితే అది మంచికి ఉపయోగిస్తే మంచిగా మారుతుంది .. చెడుకు ఉపయోగకరిస్తే చెడుగానే మారుతుంది . సోషల్ మీడియా మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీని బ్రష్టు పట్టించేస్తుంది. స్టార్ సెలబ్రెటీస్ కి సంబంధించిన ఫేక్ వార్తలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.

రీసెంట్గా సోషల్ మీడియాలో అలాంటి ఒక ఫేక్ వార్త బాగా వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ పెళ్లి చేసుకోబోతుంది అని ..అది కూడా ఒక టాలీవుడ్ స్టార్ హీరోని గుట్టూ చప్పుడు కాకుండా ఆయనతో ప్రేమాయణం నడుపుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. మొదటిసారి కాదు చాలా సార్లు ఇలా అనుపమ పరమేశ్వరణ్ పెళ్లి చేసుకోబోతుంది..హీరోతో ఎఫైర్ నడుపుతుంది నిశ్చితార్థం అయిపోయింది అంటూ వార్తలు వినిపించాయి.

ఎప్పటికప్పుడు అనుపమ అదంతా ఫేక్ అంటూ కొట్టి పడేస్తూనే వచ్చింది. అయితే ఈసారి మాత్రం అనుపమ ఫాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అయిపోతున్నారు . ఎన్నిసార్లు ఇలా వార్తలు క్రియేట్ చేస్తారు రా.. సిగ్గు లేదా ..బుద్ధి లేదా ..పెళ్లి చేసుకుంటే ఆమె చెప్పదా..? ఆమె పెళ్లి చేసుకుంటే మీకేంటి అంత హ్యాపీనెస్..? అంటూ ఓ రేంజ్ లో మండి పడిపోతున్నారు. దీంతో సోషల్ మీడియాలో మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ పెళ్లిళ్లపై ఇలాంటి ఫేక్ వార్తలు మనం ఎక్కువగా వింటూ ఉండడం గమనార్హం..!!