కియారా, ఆలియాతో కలిపి భారత్ లో ఓటు హక్కు లేని స్టార్ హీరోయిన్లు వీళ్లే..!!

ఓటు అనేది ప్రతి ఒక్కరి సాధారణ హ‌క్కు. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు వ‌ర‌కు ఓటు హక్కును వినియోగించుకోవ‌డం ప్ర‌తి ఒక‌రి బాధ్యత. అయితే చాలామందికి ఓటు వేయడం కుదరకపోవచ్చు. పరిస్థితుల ప్రభావం వల్ల అలాంటి సందర్భాలు ఏర్పడతాయి. ఇక సామాన్యుల సంగతి అలా ఉంచితే ఇండియాలోనే పలువురు హీరోయిన్లు ఇప్పటివరకు ఓటు హక్కును వినియోగించుకోలేదట. వినడానికి విచిత్రంగా ఉన్న ఇప్పటివరకు వారు ఒక్కసారి కూడా ఓటు వేయలేదు అంటూ తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు అసలు ఓటు హక్కును వినియోగించుకొని ఆ స్టార్ హీరోయిన్లు ఎవరో ఒకసారి చూద్దాం.

Production ventures and investments​ - Alia Bhatt turns 31: Exploring her  net worth and top-grossing films | The Economic Times

ఆర్‌ఆర్ఆర్ తో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్‌ సంపాదించుకున్న అలియాభ‌ట్ బాలీవుడ్ టాప్ హీరోయిన్ లిస్టులో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అటువంటి ఆలియా ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఓటు హక్కును వినియోగించుకోలేదట. అయితే దానికి కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు. నిజానికి ఆలియా భట్ భారత పౌరురాలు కాదు. ఆమెకు బ్రిటిష్ పౌరసత్వం ఉండడంతో ఆమెకు ఇక్కడ ఓటు హక్కు లేదట. ఆమె తల్లి స్వస్థలం బర్మింగ్‌హమ్ కావడంతో అలియా కూడా అక్కడే జన్మించింది. దీంతో అలియాభట్‌కు భారత్ ఓటు హక్కు దక్కలేదు. అలాగే బాలీవుడ్ స్టార్ బ్యూటీలో ఒకరైన కత్రినా కైఫ్ కూడా భారతీయురాలు కాదు.

More than once, Katrina Kaif proved she is the style icon

అందుకే ఆమెకు కూడా ఇక్కడ ఓటు హక్కు లేదు. బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్న కత్రినా టాలీవుడ్ లో వెంకటేష్ తో కలిసి మల్లేశ్వరి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు బాలీవుడ్ స్టార్ హీరోలు అందరు సరసన నటించిన కత్రినా పుట్టింది హాంగ్‌కాంగ్‌.. అందుకే ఆమెకు బ్రిటిష్ పౌరసత్వం ఉంది. కానీ ఇండియాలో ఆమెకు ఓటు హక్కు లేదు. అలాగే మరో బాలీవుడ్ తార జాక్వలిన్ ఫెర్నండేస్ కూడా ఇండియా ఓటు హక్కు దక్కించుకోలేకపోయింది. ఇండియాలో గ్లామర్ డాల్ గా క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు బహ్రేయిన్ మహిళా.

Nora: Jacqueline Fernandez's lawyer on defamation suit by Nora Fatehi: Will  respond legally to protect her own dignity, Celebrity News | Zoom TV

ఈమె అక్కడే పుట్టి పెరిగింది. అంతే కాదు జాక్వ‌లిన్‌ తల్లిదండ్రులు కూడా ఇండియన్స్ కాదట. తండ్రి శ్రీలంక, తల్లి మలేషియా పౌరులు. అయితే ఈమె ఎడ్యుకేషన్ ఆస్ట్రేలియాలో పూర్తి చేసి శ్రీలంకలో సెటిలైంది. తర్వాత జాక్వెలిన్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. అలాగే మరో బాలీవుడ్ తార నౌరా ఫతేహి స్పెషల్ సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈమె కూడా ఇండియన్ యువతి కాదు. భారతదేశంలో ఓటు వేయడానికి అర్హత లేదు.

undefined

నౌర పతి కెనడా పౌరురాలు కావడంతో ఆమెకు ఇక్కడ ఓటు హక్కు దక్కలేదు. ప్రస్తుతం ఈమె ఇండియాలోనే సెటిల్ అయింది. అలాగే టాలీవుడ్లో పలు సినిమాల్లో నటించి మెప్పించిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కూడా భారత పౌరురాలు కాదట. అందుకే ఆమె కూడా ఇప్పటివరకు ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఇలా మరికొంతమంది తారలు ఇతర దేశాల పౌరసత్వాన్ని కలిగి ఉండడంతో ఇండియాలో ఓటు వేయలేదు.