ఎయిర్ పోర్ట్ లో క్లైమాక్స్ షూట్ జరిగిన టాలీవుడ్ సినిమాల లిస్ట్ ఇదే..?!

ఇటీవ‌ల ఇండ‌స్ట్రీలో తమిళ్ నుంచి తెలుగులో డబ్ అయ్యి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది కేవలం ప్రేమలు మూవీ మాత్రమే. ఈ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయిందని చెప్పవచ్చు. మలయాళ మూవీ అయినా కూడా తెలుగులో దీనికి ప్రేక్షకులో మంచి ఆదరణ లభించింది. సినిమా క్లైమాక్స్ ఎయిర్పోర్ట్‌లో రూపొందించిన సంగతి తెలిసిందే. ఇలా గతంలో ఎన్నో సినిమాలు క్లైమాక్స్, ఫ్రీ క్లైమాక్స్ లు ఎయిర్పోర్టులో రూపొందించారు. ఆ సినిమాలన్నీ దాదాపు మంచి సక్సెస్ లో అందుకున్నాయి. అలా ఎయిర్పోర్ట్లో క్లైమాక్స్ తెరకెక్కించి హిట్ అందుకున్న సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.

22YearsForTholiPrema: Here's why the Pawan Kalyan starrer works even 22  years after its release | Telugu Movie News - Times of India

తొలిప్రేమ పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ యూత్ ఏ రేంజ్ లో కనెక్ట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఎవర్గ్రీన్ హిట్గా ఈ సినిమా పవర్ స్టార్ అభిమానుల్లో నిలిచిపోయింది. ఈ సినిమా క్లైమాక్స్ ఎయిర్పోర్టులోనే రూపొందించారు. అలాగే మహేష్ బాబు, భూమిక హీరో హీరోయిన్లుగా నటించిన ఒక్కడు మూవీ అప్పట్లో ఇండస్ట్రియల్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. దీని క్లైమాక్స్ తో సహా ముఖ్యమైన సన్నివేశాలన్నీ ఏర్పోర్ట్ లోనే రూపొందించారు. ఇక తమన్న, సూర్య కలిసి నటించిన వీడొక్కడే మూవీ ముఖ్యమైన సన్నివేశాలు కూడా ఏర్పోర్ట్ లోనే షూట్ చేశారు.

Malli Malli Idi Rani Roju Full Movie Online in HD in Telugu on Hotstar CA

డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. సినిమా క్లైమాక్స్ ఆకట్టుకుంది. ఇక మంచు మ‌నోజ్‌ హీరోగా తెరకెక్కిన ప్రయాణం మూవీ షూటింగ్ మొత్తం ఎయిర్పోర్ట్ లోనే జరిగింది. ఇది భిన్నమైన కథతో వ‌చ్చి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. శర్వానంద్, నిత్యామీనన్ జంటగా నటించిన మూవీ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వస్తుందంటే ఎంతో మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ మూవీ క్లైమాక్స్ సీన్స్ కూడా ఎయిర్పోర్టులోనే చేసిన‌ సంగతి తెలిసిందే క్లైమాక్స్. ఎంతో ఎమోషనల్ గా ఉండే ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇది సినిమా హిట్ అవడానికి బాగా ప్లస్ అయింది.