కన్నప్పలో ఆ రోల్ రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్స్ వీళ్లే..ఎందుకంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఎలాంటి స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ట్రోలింగ్ అవుతుంది .. ట్రెండ్ అవుతుంది ..ఏది ఏమైనా సరే మంచు ఫ్యామిలీ కూడా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ ఫ్యామిలీ అంటూ గుర్తు చేసుకుంటూ ఉంటుంది . మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కన్నప్ప . ఈ సినిమా కోసం భారీ స్థాయిలో కష్టపడుతున్నారు. భారీ భారీ రేంజ్ లో ప్రమోషన్స్ కూడా చేయడానికి సిద్ధమయ్యారు. పాన్ ఇండియా లెవెల్ లో కన్నప్పతీస్తున్నారు . ఆ విధంగానే పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ కాస్ట్ ను కూడా సెట్ చేసుకున్నాడు .

టాలీవుడ్ -బాలీవుడ్ -కోలీవుడ్ -మాలీవుడ్ ఇండస్ట్రిల నుంచి ప్రముఖులను ఈ సినిమాలో స్టార్స్ గా చూస్ చేసుకుంటున్నారు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ – మోహన్ లాల్ – అక్షయ్ కుమార్ లాంటి బడా హీరోలు కూడా నటిస్తూ ఉండడం గమనార్హం . అయితే హీరోల విషయంలో ఎలా ఉన్న హీరోయిన్స్ విషయంలో మాత్రం మంచు విష్ణు ప్లాన్స్ బోల్తాపడుతూ వస్తున్నాయి . నిజానికి ఈ సినిమాలో పార్వతి దేవి రోల్ కోసం చాలామంది హీరోయిన్స్ ని అప్రోచ్ అయ్యారట. ఆశ్చర్యం ఏంటంటే అందరూ కూడా సినిమాకి మొదట హామీ ఇచ్చి ఆ తర్వాత హ్యాండ్ ఇస్తున్నారట.

ఈ సినిమాలో ముందుగా హీరోయిన్గా నుపుర్ సనం ని అనుకున్నారు . పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అమ్మడు హ్యాండ్ ఇచ్చింది. ఆ తర్వాత పార్వతి దేవి రోల్ కోసం త్రిష – సమంత – నయనతార లాంటి హీరోయిన్ లని కూడా చూస్ చేసుకున్నాడు. అయితే అందరూ కూడా ఈ సినిమాకు కమిట్ అయినట్లే కమిటీ లాస్ట్ మూమెంట్లో హ్యాండ్ ఇచ్చేశారట. తాజాగా ఈ సినిమాలో పార్వతి దేవి పాత్ర కోసం కాజల్ సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది . శివుడి పాత్రలో మొదటగా ప్రభాస్ ని అనుకున్నా ఫైనల్లి ఆ రోల్ కోసం అక్షయ్ కుమార్ సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ నందీశ్వరుడు పాత్రలో మెప్పించబోతున్నాడట . దీంతో సోషల్ మీడియాలో కన్నప్ప సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . చూద్దాం ఈ సినిమాతో మంచు విష్ణు ఎలాంటి హిట్ అందుకుంటాడో..????