ఫ్లాప్ డైరెక్టర్లకు సక్సెస్ ఇచ్చిన తారక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే ‘ దేవర ‘ బ్లాక్ బస్టర్ పక్క.. ?!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ స్టార్‌గా క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమాలో నటిస్తున్నాడు. గతంలో వీరిద్దరు కాంబోలో వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెల‌కొన్నాయి. అయితే కొరటాల శివ చివరిగా తెర‌కెక్కంచిన ఆచార్య సినిమా ఫ్లాప్ పైన సంగతి తెలిసిందే. ఇలా డిజాస్టర్ అయిన క్రమంలో ఎన్టీఆర్, కొరటాలతో సినిమా చేయడం పట్ల అభిమానుల్లో కొంత భయం మొదలైంది. అయితే ఎన్టీఆర్‌కు మాత్రం ఫ్లాప్ డైరెక్టర్లకు హిట్ ఇచ్చిన రికార్డు ఉంది.

NTR to go with Puri Jagannadh?

గతంలో కూడా తారక్ ఇలాగే ఎంతోమంది ఫ్లాప్ డైరెక్టర్లకు అవకాశాన్ని ఇచ్చి సక్సెస్లు అందుకున్నారు. వారిలో డేరింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ ఒకరు. మొదట నితిన్ తో హార్ట్ ఎటాక్ సినిమాని తెర‌కెక్కించి సినిమా ఫ్లాప్ తర్వాత ఎన్టీఆర్ తో టెంపర్ సినిమాను రూపొందించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. తర్వాత ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్గా క్రేజ్‌ సంపాదించుకున్న సుకుమార్‌కు కూడా తారక్ ఇలాగే హిట్ అందించాడు. మొదట ఆయన మహేష్ బాబు తో వ‌న్‌ నేనొక్కడినే సినిమా చేయ‌గా అది డిజాస్టర్‌గా నిలిచింది.

Is Sukumar Taking Away Trivikram's Halo?

తర్వాత తార‌క్ హీరోగా నాన్నకు ప్రేమతో సినిమా చేశాడు సుకుమార్. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.అలాగే డైరెక్టర్ బాబీ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ తో ఫ్లాప్ అందుకోగా తారక్‌ జై లవకుశ సినిమాతో బాబికి ఛాన్స్ ఇచ్చారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అలాగే త్రివిక్రమ్ మొదటి అజ్ఞాతవాసి తెరకెక్కించగా ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తరువాత ఎన్టీఆర్ తో తెరకెక్కించిన అరవింద సమేత వీర రాఘవరెడ్డి ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.Jr NTR's 'Devara' to release in 2 parts, Koratala Siva announces in new  video - India Today

ఇక ప్రస్తుతం కొరటాల శివ ఆచార్య ప్లాప్ తో దేవర సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. అయితే ఈ ప్లాప్ల సెంటిమెంట్ వర్కౌట్ అయితే దేవర బ్లాక్ బస్టర్ సక్సెస్ కాయమంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలా ఎన్టీఆర్ రికార్డ్ చూసుకుంటే ప్లాప్ డైరెక్టర్లకు హిట్ అందించి వాళ్లకు మళ్ళీ అవకాశాలు వచ్చేలా కెరీర్ మ‌లుపు తిప్పారు తారక్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.