తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే ఇది ఒక సంచలనం.. ఇన్నాళ్ల చిరంజీవి కెరీర్లోనే ఫస్ట్ టైం ఇలా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న భారీ సినిమా విశ్వంభర . మనకు తెలిసిందే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాక చిరంజీవి తన స్థాయి హిట్ అందుకోలేకపోయాడు. సినిమా హిట్ అవుతున్నా కానీ మెగాస్టార్ రేంజ్ హిట్ అందుకోకపోవడం గమనార్హం .అయితే ఎలాగైనా సరే ఠాగూర్ లాంటి సినిమా హిట్ మరోసారి తన ఖాతాలో పడాలి అంటూ భీష్ముంచుకుని కూర్చున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ఈ క్రమంలోనే బింబిసారా లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వశిష్టత సినిమాకి కమిట్ అయ్యాడు . సోషియో ఫాంటసీగా ఈ సినిమా తెరకెక్కుతూ ఉండడం విశేషం .

ఈ సినిమా కోసం భారీ స్థాయిలో కష్టపడుతున్నాడు చిరంజీవి . విశ్వంభర సినిమాని వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ఆల్రెడీ ప్రకటించేశారు. సరవేగంగా విశ్వంభర షూట్ జరుగుతుంది. ఇటీవల హైదరాబాద్లో ముచింతల్ ఏరియాలో 54 అడుగుల భారీ ఆంజనేయ స్వామి విగ్రహం సెటప్ చేసి మరి షూట్ కంప్లీట్ చేశారు. ఇంటర్వెల్ యాక్షన్ సీన్స్ షూట్ చేసినట్లు దర్శకుడు ఆల్రెడీ చెప్పాడు . ఆ షూట్ నుంచి చిరంజీవి – త్రిష లుక్స్ ఆంజనేయ స్వామి విగ్రహం ఫోటోలు బయటకు రావడం విశేషం .

అయితే తెలుగు సినిమాలో ఎంత పెద్ద ఫైట్ అయినా మహా అయితే వారం లేదా పది రోజులు మాత్రమే తెరకెక్కిస్తారు.. అంతకు మించిన టైం ఎక్కువ తీసుకోరు ..కానీ విశ్వంభర. . ఇంటర్వెల్ యాక్షన్ సీన్ కి మాత్రం దాదాపు 26 రోజుల సమయం పట్టిందట ఆ రేంజ్ లో ఈ సీన్స్ ని తెరకెక్కించారట డైరెక్టర్ వశిష్ట ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు. చిరంజీవి కెరియర్ లోనే ఒక్క యాక్షన్ కి సీన్ కోసం 26 రోజుల షూట్ చేయడం ఇదే ఫస్ట్ టైం తెలుగు సినిమా చరిత్రలోనే ఇది ఓ సంచలనం గా మిగిలిపోయింది . ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆర్ట్ డైరెక్టర్ ఏ ఎస్ ప్రకాష్ దగ్గరుండి చేయించారట . ఈ సినిమాకి ఫైట్ మాస్టర్స్ గా రామ్ లక్ష్మణ్ చేస్తున్నట్లు తెలుస్తుంది . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!