రజనీ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. ‘ తలైవార్ 171 ‘ లో రజనీకాంత్ రోల్ ఇదే..

కోలివుడ్‌ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పరచుకున్న రజినీకాంత్ ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనదైన స్టైల్ లో నటిస్తూ సత్తా చాటుతున్నాడు. ఇక ప్రస్తుతం రజనీకాంత్ తన 170వ‌ సినిమా వెట్టయాన్ షూట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రజనీకాంత్.. లోకేష్ కనగ‌రాజ్‌తో 171వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ సినిమాలో నాగార్జున ఓ కీలక పాత్రలో నటించినున్నాడు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రజనీకాంత్ ఈ సినిమాలో కూలీగా నటించబోతున్నాడని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ తో పాటు రజనీకాంత్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పాస్టర్‌లో రజిని ఎప్పటి మాదిరిగానే తనదైన స్టైల్ లో సరికొత్త లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాడు. అయితే ఇందులో కూలీగా కనిపిస్తూ అందరిని మెస్మరైజ్ చేశాడు తలైవార్. ఇప్పటికే కోలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలతో

సంచలనం సృష్టించిన లోకేష్ మాట్లాడుతూ ఇదొక ప్రయోగాత్మక సినిమా అని ఇందులో రజినీకాంత్ చాలా విభిన్నంగా కనిపించబోతున్నారంటూ వివ‌రించాడు. అయితే కొంచెం నెగిటివ్ స్టేట్స్ ఉన్న రోల్లో ఆయనను చూపించబోతున్నాడ‌ట లోకేష్‌. ఇక ఈ సినిమా పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెర‌కెక్కనుంది. రజిని ఈ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం ఖాయం అంటూ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వస్తుందా అంటూ ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు.