ఇట్స్ మై సీక్రెట్ ఎఫైర్ అంటూ ఫోటో షేర్ చేసి మరి షాక్ ఇచ్చిన అనసూయ.. పోస్ట్ వైరల్..?!

టాలీవుడ్ బోల్డ్ యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పరిచయ అవసరం లేదు. మొదట జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈ అమ్మడు.. తర్వాత సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లను అందుకుంటు దూసుకుపోతున్న ఈ అమ్మడు.. ఓ పక్కన సినిమాల్లో నటిస్తూనే.. మరో పక్కన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన సినిమాలకు, పర్సనల్ విషయాలకు సంబంధించిన అప్డేట్స్ అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమె పై ఎన్ని ట్రోల్స్ జరిగిన తన స్టైల్ లో తను దూసుకుపోతుంది.

ఇప్పటికే వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ మంచి సక్సెస్ అందుకుంటున్న అనసూయ.. పాన్ ఇండియా లెవెల్లో రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న పుష్పాలో దాక్షాయినిగా లేడీ విలన్‌గా ఢీ గ్లామరస్ రోల్‌లో ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సినిమాకు సీక్వల్ గా వస్తున్న పార్ట్ 2 లో అనసూయ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగ‌ష్టు 15న రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల మంచి అంచనాలు నెల‌కొన్నాయి. అయితే అనసూయ బుల్లితెరకు దూరంగా ఉన్నా.. కొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే బుల్లితెరకు దూరం అవ్వడంతో అభిమానులు కాస్త నిరాశ చెందినా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో సంతోషిస్తున్నారు.

ఈ క్ర‌మంలో తాజాగా ఇట్స్ మై సీక్రెట్ య‌ఫైర్ అంటూ అనసూయ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. అనసూయ సీరియస్ ఎఫైర్ ఎవరితోనో కాదు మామిడిపళ్ళతో. సమ్మర్ సీజన్ కావడంతో అందరికీ ఇష్టమైన మామిడి పళ్ళు వచ్చేసాయి. అయితే అనసూయ ఇంటి ఆవరణలో ఉన్న మామిడి చెట్ల కాయలు కోసింది. తన ఇద్దరు కొడుకులు ఓ వ్యక్తితో కలిసి మామిడికాయలు తెంపి వాటిని చూపిస్తూ మామిడికాయల వేట.. ఇది ఒక సీరియస్ ఎఫైర్ అంటూ ఆమె కామెంట్ యాడ్ చేసింది. దీని బట్టి మామిడిపళ్ళు అంటే అనసూయకు ఎంత ఇష్టమో వాటితో ఉన్న బంధం ఎలాంటిదో వివరించింది. అయితే ప్రస్తుతానికి ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో తన ఫ్యాన్స్ అంతా ఆ పోస్ట్ కు రకరకాలుగా స్పందిస్తున్నారు.