ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్.. ఈ చిన్న పని చేస్తే చాలు.. సూర్యతో కలిసి నటించే ఛాన్స్..?!

కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య.. పేట సక్సెస్ తర్వాత మరోసారి కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో కొత్త సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇది సూర్యకి 44వ సినిమా కావడం విశేషం. పీరియాడికల్ డ్రామాగా గ్యాంగ్‌స్ట‌ర్.. లవ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్ ప్లే చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక జూన్ 17 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణ సంగీతం అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్‌గా తిరునావుకరసు వ్యవహరిస్తున్నాడు. కాగా సూర్య 24, పేట సినిమాలకు కూడా ఈయన సినిమా వివరించారు.

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న కంగువా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు సూర్య. ఈ సినిమా తర్వాత కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో నటించనున్నాడు. వరుసగా భారీ సినిమాలు లైన్లో ఉండడంతో సూర్య అభిమానుల్లో ఆయన సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపద్యంలో కార్తీక్ సుబ్బరాజు సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ కాల్ పోస్టర్‌ను తన ఎక్స్ పేజీలో షేర్ చేశాడు. భాషాభేదం లేదని.. ఆడ, మగ అనే తేడా లేదని ఈ క్యాస్టింగ్ కాల్ లో ఆయన వివరించాడు.

ఇక ఈ సినిమాలో నటించాలనుకునే ప్రతి ఒక్కరూ తమ పేరు.. ఇతర వివరాలను షేర్ చేస్తూ ఒకటి నుంచి మూడు నిమిషాల న‌డివితో త‌మ‌ వీడియోను 7550011050 ఈ నెంబర్‌కు పంపాలని ఆయన వివరించాడు. ఇది సూర్య అభిమానులకు.. సినిమాల్లో నటించాలనుకునే వారికి.. నిజంగా బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. ఇంకెందుకు ఆలస్యం నటనపై ఇంట్రెస్ట్ ఉన్నవారు కచ్చితంగా ఒక‌సారి ట్రై చేసేయండి.