రామ్ చరణ్ ఆ ఇద్దరు డైరెక్టర్ల నెంబర్లను బ్లాక్ చేశాడా..? గ్లోబల్ స్టార్ పరువు తీసేస్తున్న న్యూస్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లుగా ఉన్న ఆ ఇద్దరు డైరెక్టర్ నెంబర్స్ ను బ్లాక్ చేశాడా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తూ ఉండడం గమనార్హం . దానికి కారణం గతంలో ఆయన ఆ ఇద్దరు డైరెక్టర్స్ నుంచి నెగెటివిటీ ఎదుర్కోవడమే అంటూ తెలుస్తుంది .

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన సినిమా వినయ విధేయ రామ . ఈ సినిమా పరమ చెత్త టాక్ అందుకుంది . కలెక్షన్స్ పరంగా డిజాస్టర్ అయింది . అంతేకాదు రామ్ చరణ్ కి ఫుల్ నెగెటివిటీ క్రియేట్ చేసి పెట్టింది . ఈ సినిమా రిలీజ్ తర్వాత మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఏ స్థాయిలో పోట్లాడుకున్నారో కూడా మనకు తెలిసిందే. పలువురు రాంచరణ్ ని కూడా ట్రోల్ చేశారు , ఆ టైంలోనే చిరంజీవి పరోక్షకంగా ఎంట్రీ ఇచ్చే ప్రాబ్లం సాల్వ్ చేశారు . అయితే ఇక జన్మలో ఆయనతో సినిమా తీయకూడదు అని బోయపాటి శ్రీను నెంబర్ ని బ్లాక్ చేసాడట రామ్ చరణ్ .

అంతే కాదు ఆచార్య సినిమా తర్వాత కొరటాల శివ నెంబర్ ని కూడా బ్లాక్ చేశారట . ఆచార్య సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ చిరంజీవి డైరెక్టర్ లకు సినిమాలపై కాన్సన్ట్రేషన్ తగ్గింది అని పర్ఫెక్ట్ సినిమాలను తెరకెక్కించలేకపోతున్నారు అని ఘాటుగా స్పందించారు. పరోక్షకంగా ఇది కొరటాల శివకు తగిలేలానేఉన్నాయి అంటూ కొందరు ట్రోల్ చేశారు . ఈ క్రమంలోనే చరణ్ కూడా కొరటాల శివ నంబర్ ని బ్లాక్ చేసి పడేసాడట . ఈ న్యూస్ ఇప్పుడు గ్లోబల్ స్ధాయిలో వైరల్ అవుతుంది. ఆర్ ఆర్ ఆర్ తరువాత చరణ్ గ్లోబల్ స్ధాయిలో పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత చరణ్ కి సంబంధించిన ప్రతి న్యూస్ ఆ స్థాయిలో ఉన్న ట్రెండ్ అవుతుంది..!!