నిశ్చితార్ధం అయ్యాక ప్రణతి గురించి ఆ విషయం తెలుసుకుని షాక్ అయిపోయిన తారక్.. ఇప్పటికి మర్చిపోలేకపోతున్నాడా..?

లక్ష్మీ ప్రణతి .. జూనియర్ ఎన్టీఆర్ భార్య గా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . వీళ్లది ప్రేమ వివాహం కాదు .. పెద్దలు కురిచిన వివాహం. వీళ్ళ పెళ్లి చాలా అంగరంగ వైభవంగా జరిగింది. వీళ్ళకి ఇద్దరు కొడుకులు.. ఒకరు భార్గవ్ రామ్.. మరొకరు అభయ్ రామ్.. ఇద్దరు కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు .

ప్రజెంట్ దేవర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . అదేవిధంగా బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వార్ 2 సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇలాంటి మూమెంట్లోని తారక్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. తారక్ మర్చిపోలేని తేదీ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా మార్చి 26 అని చెప్పాలి . మే 20వ తేదీ ఆయన పుట్టిన రోజు ..

అయితే మార్చి 26వ తేదీ ఆయనకు పునర్జన్మ కలిగించిన రోజు.. ఆరోజు భారీ యాక్సిడెంట్ నుంచి చావు బ్రతుకుల మధ్య బయటపడ్డాడు . ఆ ఇన్సిడెంట్ ఇప్పటికీ మర్చిపోలేము. దేవుడు ఎంత విచిత్రంగా చేశాడంటే .. చావు బతుకుల నుండి బయటపడిన ఎన్టీఆర్ మార్చి 26వ తేదీనే తన భార్య లక్ష్మి ప్రణతి పుట్టినరోజు .. ఈ విషయం తెలుసుకొని ఎన్టీఆర్ షాక్ అయిపోయారట ..ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చాడు తారక్ . నిశ్చితార్థం తర్వాత లక్ష్మీ ప్రణతి బర్త డే డేట్ తెలుసుకొని షాక్ అయిపోయాడట. మార్చి 26 తన లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేని రోజు అని ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు..!!