బన్నీని లైన్ లో పెట్టిన ప్రశాంత్ వర్మ.. అసలు సిసలు బ్లాక్ బస్టర్ కాంబో రానుందా..?!

సినీ ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు ఒకే విధమైన దోరణితో సినిమాలను తీస్తూ ఏదో ఒకే జానర్ కు పరిమితమవుతూ ఉంటారు. అయితే ఇటీవల హనుమాన్ సినిమాతో సంచలనం సృష్టించిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాత్రం తన మొదటి సినిమా నుంచి చివరిగా వచ్చిన హనుమాన్ వరకు మొత్తం అన్ని సినిమాల్లోని వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సక్సెస్ అందుకుంటున్నాడు. మొదటి నుంచి అంటే సినిమా డైరెక్టర్ అవ్వక ముందు నుంచి కూడా ప్రశాంత్ వర్మ ఎన్నో డిఫరెంట్‌ షార్ట్ ఫిలిమ్స్ రూపొందించి దర్శకుడుగా తన సత్తా చాటుతున్నాడు. తన‌లో ఉన్న టాలెంట్ తోనే డైరెక్టర్గా అవకాశాన్ని అందుకుంటున్నాడు.

ఇక ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ నాకు రొటీన్ సినిమాలు చేయడం ఇష్టం ఉండదని.. వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తూ ముందుకు కదలడమే నాకు ఇష్టం అంటూ ప్రశాంత్ వర్మ వివరించాడు. అయితే ప్రస్తుతం ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమా రూపొందించే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆయ‌నుకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం నెటింట వైరల్‌గా మారింది. ప్రశాంత్.. అల్లు అర్జున్‌తో ఓ సినిమా తెర‌కెక్కించనున్నాడని.. అందులో భాగంగానే ఇప్పటికే అల్లు అర్జున్‌కు లైన్ వినిపించాడ‌ని ఈ లైన్ బన్నీకి కూడా బాగా నచ్చింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. జై హనుమాన్ తర్వాత వెంటనే మిగతా స్క్రిప్ట్ ను పూర్తి చేసి బన్నీకి వినిపించనున్నాడ‌ని వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇక ప్రస్తుతం జై హనుమాన్ తర్వాత అల్లు అర్జున్‌తో ప్రశాంత్‌ వర్మ ఓ సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ప్రశాంత్ వర్మ అతి తక్కువ బడ్జెట్‌లోనే హనుమాన్ లాంటి ది బెస్ట్ విజువల్ అవుట్ ఫుట్ అందించిన టాలెంటెడ్ డైరెక్టర్. ఇలాంటి డైరెక్టర్ తో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రతి ఒక్క నటీనటులు కోరుకుంటారు. స్టార్ హీరోలు సైతం ఈయనకు డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్, ప్రశాంత్ వర్మ కాంబోలో సినిమా వస్తుందని తెలియడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలు సిసలు బ్లాక్ బస్టర్ కాంబో ఇదే అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.