“కడుపుకు కి అన్నమే తింటున్నారా రా..?”..షాకింగ్ వీడియోని షేర్ చేసిన రష్మి..!!

రష్మీ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ యాంకర్ గా రాజ్యమేలేస్తున్న బ్యూటీ . సోషల్ మీడియాలో ఈమెపై ఎంత పాజిటివిటీ ఉంటుందో అంతే నెగిటివిటీ కూడా ఉంటుంది . మరీ ముఖ్యంగా రష్మీ మూగజీవుల పట్ల చాలా చాలా ప్రేమగా ఆప్యాయంగా ఉంటుంది . మూగజీవులను ఎవరైనా హింసించారంటే.. తాట తీసేస్తుంది . అది ఎంతటి పెద్ద వ్యక్తి అయినా సరే అలాంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం . తాజాగా సోషల్ మీడియాలో రష్మీ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసింది .

ఈ వీడియో ఎవరైనా మూగజీవులు చూస్తే కన్నీళ్లు పెట్టుకోకు తప్పదు. అంత దారుణంగా ఉంది . యాంకర్ రష్మి గౌతమ్ ఈ వీడియోని షేర్ చేస్తూ సంచలన కామెంట్స్ చేసింది . “ఆవు మనకు తల్లి కంటే ఎక్కువ .. జీవితంలో మన తల్లి మూడేళ్లు మాత్రమే తన రొమ్ములతో పాలు ఇస్తుంది .. కానీ ఆవు జీవితాంతం మనకు పాలు అందిస్తుంది .. ఈ విషయం చాలామందికి తెలియకపోవడం బాధాకరం”..

“స్వరం లేని జీవిని ఇంతలా హింసించడం ఎంతవరకు కరెక్ట్..? ఇలాంటి వ్యక్తులు తమ సొంత కుటుంబ సభ్యులపై హింస చూపడానికి కూడా వెనకడుగు వేయరు.. ఆ వ్యక్తి తల్లిని గౌరవించడం అనేది జరగదు..అని ఈ వీడియో చూస్తేనే అర్థమయిపోతుంది” అంటూ రష్మీ మూగజీవుల పట్ల ఒక వ్యక్తి దారుణంగా ప్రవర్తిస్తున్న వీడియోను షేర్ చేసింది. రష్మి బాధను అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తున్నారు జనాలు. ఇలాంటి మనుషులు ఇంతే రష్మీ ..మనము ఏం చేయలేం అంటూ మండిపడుతున్నారు . ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . కొంతమంది కడుపుకి అన్నమే తింటున్నావా వెధవ..? అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!