ప్రభాస్ శివుడు రోల్ కాదు అని కన్నప్ప నుండి తప్పుకున్న నయన్.. న్యూ పార్వతీ దేవి ఎవరంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. ఈ మధ్య కాలంలో స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో బాగా బాగా వైరల్ గా మారుతున్నాయి. మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప. ఈ సినిమా కోసం దాదాపు 100 కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం అందుతుంది . అంతేకాదు ఈ సినిమాలో బడా బడా స్టార్స్ ని కూడా దించుతున్నారట .

ఇప్పటికే చాలామంది స్టార్స్ ఈ సినిమాలో భాగమయ్యారు . తాజాగా ఈ సినిమాలో శివుడి పాత్ర కోసం అక్షయ్ కుమార్ ని చూస్ చేసుకున్నారు మేకర్స్ . నిజానికి ఈ సినిమాలో శివుడి పాత్రలో ప్రభాస్ కనిపించాల్సి ఉంది . చాలా రోజులుగా అదే ప్రచారం జరుగుతుంది . శివుడి పాత్రలో ప్రభాస్.. పార్వతీదేవి పాత్రలో హీరోయిన్ నయనతార నటించాలి అని మేకర్స్ అనుకున్నారట . వాళ్లు కూడా ఓకే చేశారట .

లాస్ట్ మినిట్లో ఏమైందో ఏమో తెలియదు కానీ ప్రభాస్ ప్లేస్ లోకి అక్షయ్ కుమార్ వచ్చాడు . శివుడి పాత్రలో ఈ సినిమాలో అక్షయ్.. నటించబోతున్నాడట . ఈ విషయం తెలుసుకున్న నయనతార సినిమా నుంచి తప్పుకుంది అంటూ ప్రచారం జరుగుతుంది. అంతేకాదు నయనతార ప్లేసులో హీరోయిన్ కాజల్ అగర్వాల్ నీ రంగంలోకి దింపబోతున్నాడట మంచు విష్ణు. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది . చూద్దాం మరి వీళ్ళ కాంబో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో..??