ప్రేమలో మోసపోకుండా ఉండటానికి అలాంటి పని చేస్తున్న రష్మిక.. లెటేస్ట్ పోస్ట్ వైరల్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. ప్రేమ పాఠాలు నేర్చుకుంటుందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . సినిమాలో ఎంత బిజీగా ఉన్నా సరే క్షణం తీరిక దొరికిన అభిమానులతో చిట్ చాట్ చేసే రష్మిక మందన్నా.. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసింది . ఆ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

రష్మిక ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది . అందులో స్పానిష్ లవ్ డిస్క్రిప్షన్ అనే పేరుతో ఉన్న బుక్ ని షేర్ చేసింది . అంతేకాదు అది చూస్తే క్లియర్ గా అర్ధమైపోతుంది ప్రేమలో మోసపోకుండా ఉండడం ఎలా అనే బుక్ చదువుతున్నట్లు . ఆమె ప్రేమ గురించి తెలుసుకుంటున్నట్లు చెప్పకనే చెప్పేసింది . దీంతో అది చూసిన నెటిజెన్లు ప్రేమలో మోసపోకుండా ఉండడానికి ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నావా..?

లేక నువ్వు మోసం చేస్తే వేరే వాళ్ళు ఎలా కనిపెట్టేస్తారు అని జాగ్రత్త పడుతున్నావా..? అంటూ సెటైరికల్ గా కౌంటర్స్ వేస్తున్నారు. ప్రజెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉంది రష్మిక మందన్నా. అంతేకాదు తెలుగులో రెండు సినిమాలు బాలీవుడ్ లో నాలుగు సినిమాలు చేతిలో పట్టుకొని ఉంది . పుష్ప2 సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది మిగతా సినిమాలో పరిస్థితి హిట్ అయితే గాని రష్మిక కెరియర్ ఎలా ముందుకెళ్తుంది ..? అనేది చెప్పలేని పరిస్థితి అంటున్నారు సినీ విశ్లేషకులు..!