మామిడిపండు ఇష్టంగా తింటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..?!

చాలామంది ఇష్టంగా తినే ఫ్రూట్స్‌లో మామిడిపండు కూడా ఒకటి. కేవలం వేసవిలో మాత్రమే దొరికే సీజనల్ ఫ్రూట్ కోసం చాలామంది ఏడాదంతా ఎదురు చూస్తూ ఉంటారు. ఇతర పండ్లతో పోలిస్తే రుచిలో మామిడిపండును మించినది మరొకటి ఉండదనడంలో అతిశయోక్తి లేదు. అందుకే వేసవిలో మాత్రమే దొరికే ఈ మామిడి పండ్లను నేరుగా, జ్యూస్ రూపంలో, ముక్కలు చేసుకుని ఇలా రకరకాలుగా తింటూ ఎంజాయ్ చేస్తారు. మామిడిపండు లో ఫాలిక్ యాసిడ్, వీటా కెర‌టీన్‌, కాల్షియం ఇలా అన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మామిడి పండ్లు తినడం వల్ల ఇన్స్టంట్ ఎనర్జీ లభిస్తోంది. దీంతో వేసవిలో డిహైడ్రేషన్ సమస్య నుంచి కూడా తప్పించుకోవచ్చు.

మామిడిపండు ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెడుతుంది. మలబద్దక సమస్యలను క్లియర్ చేస్తోంది. ఇందులో ఉండే పోషకాలు రక్తంలో షుగర్ లెవెల్స్‌ను బ్యాలెన్స్ చేయడానికి.. అలాగే గుండె ఆరోగ్యానికి సహకరిస్తాయి. చర్మ సమస్యలను నివారించి.. కంటి ఆరోగ్యానికి కూడా మామిడి ఎంతో ప్రయోజన కారిగా ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న మామిడి పండ్లను సరైన పద్ధతిలో తినకపోవడం వల్ల ఎన్నో నష్టాలు కూడా జరుగుతాయని నిపుణులు చెప్తున్నారు. మామిడిపండ్లలో ఫైటిక్ యాసిడ్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది శరీరంలోని వేడి పెంచే అవకాశాలు ఉన్నాయి.

అందుకే మామిడి పండ్లను ఏమాత్రం నేరుగా తినకుండా కనీసం ఒకటి లేదా రెండు గంటల పాటు నీటిలో నానబెట్టి తర్వాత తినడం వల్ల ఇందులో ఉండే ఫైటిక్‌ యాసిడ్ శాతం తగ్గుతుందట. ఇంకా వీటిని నీటిలో నానబెట్టి తినడం వల్ల అందులోని పోషకాలు శరీరానికి పూర్తిస్థాయిలో అందుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే వేసవిలో దొరికే మామిడి పండ్లను ఇష్టంగా తినడం వ‌ల్ల‌.. అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తప్పవని.. ఎక్కువగా తింటే మోషన్స్, శరీరంపై వేడి గడ్డలు, దురద లాంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని.. మితంగా మామిడి పండ్లను తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.