విజయ్ దళపతి మూవీ డైరెక్టర్‌గా త్రివిక్రమ్.. డీటెయిల్స్ ఇవే..!!

సౌత్ సూపర్ స్టార్ విజయ్ దళపతి గురించి ఇటీవల కాలంలో ఎన్నో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా విజయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో.. ఈ వార్తలు మరింత జోరందుకున్నాయి. విజయ్ నటిస్తున్న గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (గోట్) త్వరలో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం నెట్టింటి వైరల్ గా మారింది. అల్లు అర్జున్ పుష్పా 2తో పాటు కాంపిటేషన్ గా గోట్‌ సినిమా థియేటర్లో రిలీజ్ చేయనున్నట్లు టాక్. అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి క్లాస్ ఉండనుంది. ఇక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత విజయ్‌ సినిమాల్లో నటించిడ‌ని వార్త‌లు వినిపించ‌డంతో విజయ్ చివరి సినిమాపై నెటింట చర్చలు మొదలయ్యాయి.

ఇటీవల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ తన పార్టీని కొత్తగా స్థాపించుకున్నాడు. ఆ పార్టీకి తమిళ వెట్రి కజగం అనే నామకరణ చేశారు. తమిళనాడులో 2026 లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బరిలో దిగనున్నాడు. దీంతో విజయ్‌ సినిమాలకు గుడ్ బై చెప్పేనున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. అయితే తాజాగా దీనికి సంబంధించిన కొత్త అప్డేట్ వైరల్ గా మారింది. విజయ్ చివరిగా పొలిటిక్స్‌ సెటైరిక‌ల్‌ సినిమాను తెరకెక్కించనున్నాడని.. రాజకీయాల్లోకి రాకముందు.. ఈ మూవీ తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారని దళపతి 69 సినిమాకి వెట్రిమారన్ డైరెక్షన్ వహించనున్నాడని వార్తలు వినిపించాయి.

కమిట్మెంట్స్ కారణంగా ఆయన ఈ ప్రాజెక్టుకి దర్శకత్వం వహించలేక‌పోతున్నాడంటూ మరో వార్త చెక్కర్లు కొడుతుంది. అయితే అతని ప్లేస్ లో ఇద్దరు పెద్ద స్టార్ డైరెక్టర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ భారీ బడ్జెట్ సినిమాకి టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. మరో డైరెక్టర్ హెచ్ వినోద్ కూడా ఈ సినిమాకు డైరెక్టర్‌గా పని చేయనున్నాడట. ఈ ఇద్దరిలో ఒకరి పేరు మాత్రమే ఖరారు కానంది. దళపతి విజయ్‌కు త్రివిక్రమ్ దర్శకత్వం వ‌హిస్తాడా.. లేదా డివివి దానయ్య ఈ సినిమాకు డైరెక్టర్గా వ్యవహరిస్తార.. తెలియాలంటే కొంతకాలం వేచి చూస్తే గాని తెలియదు. అలాగే ఈ సినిమాని దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెర‌కెక్క‌నుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.