అనిల్ రావిపూడి డైరెక్టర్ గా సక్సెస్ కావడానికి కారణం ఆ స్టార్ హీరోనా.. ఇన్నాళ్ళకి రివిల్ అయినా సీక్రెట్..?!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ డైరెక్టర్స్‌గా కొన‌సాగుతున్న‌వారిలో అనిల్ రావిపూడి ఒకరు. పటాస్ సినిమాతో డైరెక్టర్గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈయన.. అంతకు ముందు పలు సినిమాలకు స్క్రిప్ట్ రైటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే అనిల్ రావిపూడి డైరెక్టర్‌గా ఈ రేంజ్ లో సక్సెస్ అందుకోవడానికి డైరెక్షన్‌లోకి అడుగు పెట్టడానికి ప్రధాన కారణం ఓ స్టార్ హీరో అంటూ నెటింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు. అనిల్ రావిపూడి స్టార్ డైరెక్టర్ గా అవ్వడానికి ఆయన ఎలా కారణమయ్యారో.. ఒకసారి తెలుసుకుందాం.

టాలీవుడ్ కింగ్‌ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న ఈయన.. బి.ఎల్.ఆదిత్య డైరెక్షన్లో బిగ్ బాస్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా అనిల్ రావిపూడి వ్యవహరించారు. ఆ సమయంలో నాగార్జున అనిల్ రావిపూడిని బాగా ఎంకరేజ్ చేసేవారట. ఆయన చేసిన సీన్లను వింటూ డైలాగ్స్ చెబుతూ చాలావరకు బాగా చెప్తున్నావు అంటూ ప్రోత్సహించడంతో.. స్క్రిప్ట్ రైటర్ గా మరిన్ని సినిమాలకు వ్యవహరించాడట.

అనిల్ రావిపూడి అలా చాలా సినిమాలకు రైటర్ గా వ్యవహరించిన తర్వాత తనకు వచ్చిన అనుభవంతో డైరెక్టర్గా మారి పటాస్ సినిమాను తెరకెక్కించాడు. అప్పటినుంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా రానిస్తూ వరుస సినిమాలతో హిట్ అంటుకుంటున్నాడు. తాజాగా బాలకృష్ణతో భగవంత్ కేసరి సినిమాను తెరకెక్కించి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం వెంకటేష్ తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గతంలో వెంకీ ఎఫ్ 2,3 సిరీస్ లు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో వెంకటేష్ కు మరో హిట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు అనిల్ రావిపూడి.