గేమ్ చేంజర్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. ఒకే నెలలో బరిలో దిగనున్న తారక్, చెర్రీ.. బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అయినట్టేనా..?!

టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు హీరోలు చివరిగా రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో క‌లిసి నటించి గ్లోబల్ స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్న రాంచరణ్, ఎన్టీఆర్ ప్రస్తుతం ఎవరికి వారు సోలో సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇద్దరు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా గ‌డుపుతున్నాడు.

కొర‌ట్టాల శివ డైరెక్షన్లో రెండు పార్ట్ లుగా రానున్న ఈ సినిమా.. మొదటి పార్ట్ షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్‌ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ప్రస్తుతం తారక్, చెర్రీల సినిమాలకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇంకొ నాలుగు, ఐదు నెలలు ఓపిక పడితే ఆర్‌ఆర్ఆర్ తర్వాత చర్రీ నుంచి సోలోగా వస్తున్న సినిమాను ఫ్యాన్స్ ఎంజాయ్ చేయవచ్చు అంటూ దిల్ రాజు వేడుకల్లో వివరించాడు.

కాగా రిలీజ్ డేట్ ను వారు స్వయంగా తెలియజేయకపోయినా.. ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. అక్టోబర్ 31న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారట. కాకపోతే శంకర్‌ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా కూడా ఈ ఏడాది అక్టోబర్ 11 రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. దీంతో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజ‌ర్‌, ఎన్టీఆర్ దేవర సినిమాలు ఒకే నెలలో రిలీజ్ కానున్నాయి. కాగా రిలీజ్ డేట్‌లకు కాస్త గ్యాప్ ఉండడంతో ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ ను బ్లాస్ట్ చేస్తాయని ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు.