రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఇంటర్వెల్ ట్విస్ట్ లీక్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..

మెగాస్టార్ నట వార‌సుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు రామ్ చరణ్. గ్లోబల్ స్టార్ గా పాపులాటి దక్కించుకున్న ఆయన ప్రస్తుతం గేమ్ చేంజ‌ర్‌ సినిమాలో నటిస్తున్నాడు. చరణ్ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించి మెప్పించాడు. చెర్రీ చేసిన సినిమాలలో చిరుత, మగధీర, ధ్రువ, రంగస్థలం, ఆర్‌ఆర్ఆర్ సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే చరణ్ కు తిరుగులేని మార్కెట్ ను ఏర్పరిచాయి. ఇప్పుడు శంకర్ డైరెక్షన్లో నటిస్తున్న గేమ్ చేంజ‌ర్‌ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమా స్టార్ట్ చేసి ఇప్పటికే చాలా కాలం అవుతున్నా.. ఈ సినిమా నుంచి కనీసం గ్లింప్స్‌ కానీ, టీజర్ కానీ రిలీజ్ చేయలేదు మేకర్స్. ఇప్పటివరకు ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ అయింది. ఇదిలా ఉంటే రీసెంట్గా సోషల్ మీడియాలో రామ్ చరణ్ హెలికాప్టర్ నుంచి ల్యాండ్ అవుతున్న‌ ఫోటో లీక్ అవడంతో ఈ ఫోటో చూసిన చరణ్ అభిమానులు ఇది ఈ సినిమాలో వచ్చే ఇంట్రడక్షన్ సీన్ అంటూ ఫోటోను తెగ వైరల్ చేశారు. ఇదే క్రమంలో ఈ సినిమా ఇంటర్వెల్లో అదిరిపోయే ట్విస్ట్ ఉండబోతుందని.. ఆ ట్విస్ట్ ఇదే అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. సినిమాలో ఇద్దరు రామ్ చరణ్‌లు ఉంటారంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

Game Changer : గేమ్ చెంజర్‌ని హ్యాండిల్ చేయలేనని.. స్టోరీ వదులుకున్న స్టార్  డైరెక్టర్.. ఎవరు అతను..? | S shankar ram charan game changer story news  gone viral-10TV Telugu

అయితే వీరిలో ఒకరికి ఒకరుంటే కోపమని.. దాంతో ఇంటర్వెల్ సమయంలో ఒక రామ్ చరణ్ మరో రామ్ చరణ్ ను షూట్ చేసేస్తాడని.. దానితో ఈ సినిమాకు ఇంటర్వెల్ వస్తుందని.. వీళ్ళిద్దరి మొదటి శత్రువులుగా ఉన్నా తర్వాత క‌లిసిపోతార‌ట‌. ఇంత‌కి వీరిద్దరి మధ్య గొడవ ఏంటి అనే విషయాన్ని సెకండ్ హాఫ్ లో చూపిస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. సినిమా కథ మొత్తం లీక్ లతో బయటకు వచ్చేస్తే ఇక సినిమా ఎలా బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ ఫైర్ అవుతున్నారు. ఇలాంటి లీక్స్ కాకుండా సినిమాలు కాపాడాలి అంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇప్పటికీ గేమ్ చేంజ‌ర్‌ రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్‌ అనౌన్స్ చేయలేదు. అయితే త్వరలోనే టీజర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.