మెగా ఇంటి కోడలు అవ్వడానికి ఉపాసనకు సురేఖ పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా ..? భలే ఫన్నీగా ఉందే..!!

సినిమా ఇండస్ట్రీలోని వన్ అఫ్ దట్ ట్రెడిషనల్ క్యూట్ రొమాంటిక్ పెయిర్ గా సంపాదించుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. ఆయన భార్య ఉపాసన. వీళ్ళిద్దరి జంట ఎంత అన్యోన్యంగా ఉంటారో మనకు తెలిసిందే . ఎక్కడ వల్గారిటీ ఉండదు ..కానీ వీళ్ళ ఫోటోషూట్స్ మాత్రం చాలా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అందరిలా పబ్లిక్ లో ముద్దులు పెట్టుకోరు కానీ చాలా సైలెంట్ గా మాత్రం బిహేవ్ చేస్తూ ఉంటారు.

రీసెంట్ గా ఈ జంటకు సంబంధించిన ఒక వార్త నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. నిజానికి రామ్ చరణ్ కంటే ఉపాసన వయసులో పెద్దది అయినా సరే మెగా ఫ్యామిలీ కోడలుగా యాక్సెప్ట్ చేయడానికి కారణం సురేఖ పెట్టిన కండిషన్కు ఉపాసన యాక్సెప్ట్ చేయడమే . మొదటి నుంచి రాంచరణ్ మంచి ఫుడీ బాగా కుమ్మేస్తాడట . హెల్త్ కాన్షియస్ అస్సలు ఉండదట .

కొడుకు హెల్త్ విషయంలో మొదటి నుంచి సురేఖకు ఎప్పుడు దిగులు ఉండేదట . అయితే ఉపాసనను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చరణ్ చెప్పిన మూమెంట్లో సురేఖ ఉపాసనకు క్రేజీ కండిషన్ పెట్టిందట . ” వీడి నోరు కంట్రోల్లో ఉండాలి .. వీడి హెల్త్ కరెక్ట్ గా ఉండాలి ..అలా నువ్వు చేయగలను అని నాకు మాటిస్తేనే మీ పెళ్లికి ఒప్పుకుంటాను “అంటూ సరదాగా కండిషన్ పెట్టిందట . ఉపాసన సైతం ఆ కండిషన్ యాక్సెప్ట్ చేసింది . సురేఖ సరదాగా పెట్టిన కండిషన్ను ఉపాసన సీరియస్గా తీసుకుంది . ఇప్పటికీ రామ్ చరణ్ ప్రతి డైట్ విషయంలో ఉపాసన స్పెషల్ కేర్ తీసుకుంటుంది..!!

.