ఇండస్ట్రీలో నెక్స్ట్ పెళ్లి పీటలు ఎక్కబోయేది ఆ హీరోయిన్ నే.. రాసిపెట్టుకోండి..నో డౌట్..!!

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో పెళ్లి పీటలు ఎక్కుతున్న స్టార్ హీరోయిన్స్ లిస్ట్ ఎక్కువైపోతుంది . ఆ మాటకొస్తే హీరోయిన్స్ ఏ కాదు హీరోలు కూడా పెళ్లిళ్లు చేసుకుని లైఫ్ లో సెటిలైపోతున్నారు. చాలా చిన్న ఏజ్ లోనే లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది నేటి యువత . అయితే రీసెంట్గా ఆ లిస్ట్ లోకి యాడ్ అవ్వబోతుంది మరో స్టార్ హీరోయిన్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

ఆమె మరి ఎవరో కాదు శృతిహాసన్ . సలార్ సినిమాతో రీసెంట్గా సూపర్ డూపర్ హిట్ అందుకున్న శృతిహాసన్ డ్యూడిల్ ఆర్టిస్ట్ సంతాను హజారికా తో డేటింగ్ లో ఉంది . వీళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో ఏ రకంగా వైరల్ అవుతూ ఉంటాయో కూడా మనకు తెలిసిందే. ఇంకా ఎన్నాళ్లు డేటింగ్ చేస్తారు పెళ్లి చేసుకోమంటూ కుటుంబ సభ్యుల నుంచి ఫోర్స్ మొదలైందట.

ఈ క్రమంలోనే వరలక్ష్మి శరత్ కుమార్ – రకుల్ ప్రీత్ సింగ్ లను చూసి శృతిహాసన్ కూడా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయిందట . త్వరలోనే వీళ్ళ పెళ్లి డేట్ కూడా అనౌన్స్ చేయబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు శృతిహాసన్ ప్రెసెంట్ టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ – హాలీవుడ్ సినిమాలతో బిజీగా ముందుకెళ్తుంది . పెళ్లి చేసుకున్న సరే రొమాన్స్ విషయంలో కానీ సినిమాల విషయంలో కానీ ఏం మాత్రం తగ్గేదేలే అన్న రేంజ్ లో దూసుకుపోవడం మాత్రం కన్ఫామ్ అంటున్నారు అభిమానులు . చూద్దాం మరి ఈ బ్యూటీ ఏం చేస్తుంది? ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..?