బాలీవుడ్ స్ట్రైట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తారక్.. ప్లాన్ వర్కౌట్ అయినట్టేనా..?!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బిజీ లైన్‌అప్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు కేవలం తెలుగు హీరో గానే గుర్తింపు తెచ్చుకున్న తారక్.. ఆర్ఆర్ఆర్‌తో పాన్ ఇండియా హీరోగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. పూర్తి లెవెల్ లో ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారకపోయినా.. దేవర మూవీ తో పాన్ ఇండియాలో సత్తా చాట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు తారక్. భారీగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా హిట్ అయితే మాత్రం ఆయనకు సౌత్ ఇండస్ట్, బాలీవుడ్ లతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో భారీ పాపులారిటీ వస్తుందనటంలో సందేహం లేదు. ఈ తారక్ తన నెక్స్ట్ మూవీ విషయంలో మంచి ప్లానింగ్ లో ఉన్నాడు. ముందు చూపుతో జాగ్రత్తగా సినిమాలను ఎంచుకుంటు నటిస్తున్న తారక్.. ఓ టార్గెట్ ను ఫిక్స్ చేసుకుని ఆ టార్గెట్ అందుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు.

దీంతో పాటు తారక్ బాలీవుడ్ లో స్ట్రైట్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. వరల్డ్ వైడ్ పాపులారిటీతోపాటు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. ఇక తారక్ నెక్స్ట్ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. వారి అంచనాలను రీచ్ అయ్యేవిధంగా ఎన్టీఆర్ తన ప్రాజెక్టును సెట్ చేసుకుంటున్నాడు. ఏ హీరోకైన నార్త్ మార్కెట్లో స్టార్‌మార్క్ ప‌డితే ఇక తిరిగి చూసుకునే అవసరం ఉండదు. అలాగే ప్రభాస్, కేజిఎఫ్ మూవీతో య‌ష్ నార్త్‌లో సత్తా చాటుకుని మార్కెట్ ని పెంచుకున్నారు. నార్త్ ఆడియన్స్ తారక్ మా హీరో అని పిలుచుకునే ప్రయత్నంలో ఎన్టీఆర్ తెగ కష్టపడుతున్నాడు.

అందులో భాగంగా ఇప్పటికే హిందీలో వార్ 2 లో నటించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌లో త్వరలోనే తారక సందడిచేయనున్నాడు. ఇక ఈ సినిమాలో స్పై ఏజెంట్‌గా తారక్‌ కనిపించన్నునాడు. తారక్ పాత్రలో చాలా షేడ్స్‌ ఉంటాయట. పాజిటివ్ గానే కాకుండా నెగటివ్ గానూ కనిపిస్తాడని తెలుస్తుంది. యష్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందుతున్న స్పై యూనివర్స్ ఫీలిమ్స్‌లో ఇది ఒకటి. ఇందులో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నాడు. దీంతోపాటే మరో స్పై యూనివర్స్‌ మూవీకి తారక్ సైన్ చేసినట్లు తెలుస్తుంది. ఇది తారక్ స్ట్రైట్ మూవీ హీరోగా తారక్ మాత్రమే ఉంటారు.

దీనికి కూడా య‌ష్ రాజ్‌ ఫీలిమ్స్‌ వారే నిర్మాణ బాధ్యతలు తీసుకుంటున్నారు. వార్ 2 పూర్తయిన వెంటనే ఈ మూవీ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే వేచి చూడాలి. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ కొర‌టాలి శివ డైరెక్షన్లో దేవరలో నటిస్తున్నాడు. ఇందులో డబల్ రోల్ లో కనిపించిన్పునాడు తారక్. ఎన్టీఆర్ సర‌స‌న‌ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. మరో మరాఠీ మూవీ కూడా అతని సెకెండ్ రోల్ లో కనిపించబోతుందని టాక్. ఇక సైఫ్ అలీఖాన్‌ ఇందులో విలన్ పాత్ర పోషిస్తున్నాడు. అక్టోబర్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్టు కొరటాల ముందే ప్రకటించాడు.