నా భర్త నన్ను ఆ పని చేయమని ఫోర్స్ చేస్తున్నాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటి..!

బుల్లితెర నటి సునంద గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సునంద పలు సీరియల్ లో పిల్లగా నటించి ప్రేక్షకులను బాగా మెప్పించింది. అలాగే మహారాణి అనే షోలో విన్నర్ గా కప్ కూడా గెలుచుకుంది. ఇక‌ సునంద ముద్దమందారం సీరియల్ ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది.

ఆ తర్వాత ఇండస్ట్రీలోకి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.ఇక కొద్ది రోజులు పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయటానికి అన్నిటికీ దూరమైంది.ఇటీవలే ప్రేమ ఎంత మధురం సీరియల్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా అనేక టీవీ షోలో పాల్గొంటూ ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఇక ఢీ సెలబ్రిటిస్ షోలో తన డాన్స్ తో అందరినీ మెప్పిస్తుంది.తాజాగా సునంద తన భర్త క్యారెక్టర్ ఎలాంటిదో చెప్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

“నాకు నా భర్త చాలా సపోర్ట్ చేస్తాడు.నాకు డాన్స్ ఇష్టం ఉండటం వల్ల పలు షోలలో పాల్గొంటాను. ఈ క్రమంలో నేను ఇంకొకరితో డాన్స్ చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేస్తున్నాడు. అయితే డాన్స్ చేస్తున్నప్పుడు మా ఆయన చూస్తే బాగోదని నేను ఇబ్బంది పడుతున్నాను. కానీ ఆయన మాత్రం ఇది నీ వృత్తి అని చెబుతూ ఉంటారు. ఇలాంటి భర్త దొరకటం నిజంగా నా అదృష్టం ” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.