ఏజ్ పెరుగుతున్న కొద్దీ మరింత యంగ్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న శ్రియా.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనా..?!

సీనియర్ స్టార్ బ్యూటీ శ్రియ శరన్‌కు తెలుగులో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌సన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికీ యంగ్‌ లుక్స్‌తో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గత కొంతకాలంగా ఎటువంటి సినిమాలలో కనిపించకపోయిన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలతో కుర్రకారును మెప్పిస్తుంది. రోజురోజుకు ఏజ్ ను మరింతగా తగ్గించుకుంటూ.. రివర్ ఏజింగ్ సాధ్యమే అని నిరూపిస్తుంది.

ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు టాప్ టెన్ లిస్టులో పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికీ పలు సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూ మెప్పిస్తుంది. కొన్ని సినిమాల్లో కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంటుంది. సీనియర్ హీరోయిన్గా ఇండస్ట్రీలో మంచి పేరు ఉన్న శ్రియ శరన్ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసుకుంది. తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్‌లో మాత్రం వరుస సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటుంది. మరో పక్క తెలుగులోనూ అడపా దడప సినిమాల్లో మెరుస్తుంది.

సెకండ్ ఇన్నింగ్స్ లోను వర్సెస్ సినిమాలతో వెండితెరపై మెస్మరైజ్ చేస్తున్న ఈ బ్యూటీ.. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఫిట్నెస్ ప్రీక్ మరింతగా పెంచుకుంటుంది. తన హాట్ ఫోటోషూట్లతో కుర్రకారును ఆకట్టుకుంటూ.. నెట్టింట మెరిసిన ప్రతిసారి ప్ర‌ష్‌ లూక్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా మరో ట్రెండింగ్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చిన శ్రియ శరన్. నాలుగు పదుల వయసు దాటిన ఇంకా యంగ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చే అందాన్ని అలా మెయింటెన్ చేయడానికి అసలైన కారణం శ్రీయ శరణ్‌ ప్రతిరోజు మిస్ చేయకుండా వర్కౌట్ చేయడమైనట. అలాగే ఆమె జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటూ.. హెల్ది ఫుడ్ ను మాత్రమే తీసుకుంటుంద‌ట‌. ఏజ్ పెరిగేకొద్ది తన ఫిట్నెస్ పై మరింత శ్రద్ధ చూపుతూ ఆమె రోజురోజుకి మరింత యాంగ్ లుక్స్‌లో కనబడుతుంది.