ఇదెక్కడి అభిమానం రా సామి.. అంద‌రి ముందు తెలుగు అభిమాని చేసిన ప‌నికి షాక్ అయ్యిన ప్రేమ‌లు హీరోయిన్‌..?!

నిన్న మొన్నటివరకు కుర్రళ‌కు ఫేవరేట్ క్రష్ అంటే త్రిప్తి డిమ్రి.. యానిమల్ తో ఈ ముద్దుగుమ్మ‌ నేషనల్ క్రష్‌గా క్రేజ్ ద‌క్కించుకుంది. దీంతో ఈ అమ్మాడి ఫాలోయింగ్ ఒక‌సారిగా అమాంతం పెరిగిపోయింది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ ప్లేస్‌ను మరో కేరళ అందం దోచేసుకుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ పేరు తెగ ట్రెండ్ అవుతుంది. తనే మమితా బైజు. మలయాళంలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై భారీ స‌క్స‌స్‌ అందుకున్న ప్రేమలు హీరోయిన్‌. తెలుగులో రిలీజైన ఈమూవీకి ఇక్క‌డ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇందులో రేణు పాత్రలో చలాకీ అమ్మాయిగా కనిపించి ఆమె నటనతో అంద‌రిని ఆకట్టుకుంది మమితా.

ప్రేమలు కంటే ముందు దాదాపు 15 సినిమాల‌లో ఈ అమ్మ‌డు న‌టించినా.. కేవ‌లంఈ ఒక్క‌మూవీతో అమ్మ‌డు మొత్తం సౌత్ ఇండస్ట్రీలోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది . ఆమె నటనకు, క్యూట్ నెస్ కు తెలుగు కుర్రళ్ళు అయితే పిచ్చేకిపోతున్నారు. అంత‌లా కుర్ర‌కారును ఆక‌ట్టుకుంది ఈ చిన్న‌ది. ప్ర‌స్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్న ఈ ముద్దుగుమ్మ.. సాయి పల్లవిని ఫాలో అవుతున్నట్లు స‌మాచారం. ఇటీవల ప్రేమలు మూవీ ప్రమోషన్లలో చీరకట్టులో కనిపించి న్యాచురల్ బ్యూటీగా మెస్‌మ‌రైజ్‌చేసింది.

ఇక ఇటీవ‌ల‌ ప్రేమలు సక్సెస్ మీట్ లో పాల్గొన్న మమితాకు ఓ తెలుగు అభిమాని ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తుంది. ప్రేమలు మూవీ సక్సెస్ మీట్ లో ఓ అభిమాని మమితా అంటే చాలా అభిమానం అంటూ.. ఆమె చాలా నచ్చారని వివ‌రించాడు. ఆమె ప‌ర్‌మిష‌న్ తీసుకుని స్టేజీ పైకి వచ్చిన ఆ ఆభిమాని చేసిన స‌నికి మ‌మిత షాక్ అయ్యింది. పళ్లెంలో హారతి ఇచ్చి అంద‌రిముందే ఆమెను ఓ దేవ‌త‌లా ట్రీట్ చేశాడు. క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్ అని చెబుతూ హారతి ఇవంవ‌డంతో ఆమెతో పాటు అక్క‌డున్న‌వారంతా ఆశ్చ‌ర్య‌పోయారు. దీంతోప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Filmy Hunt (@filmyhuntlive)