సినిమా ఇండస్ట్రీ చరిత్రలోనే సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసిన మృణాల్ ఠాకూర్ ..ఇప్పటివరకు ఏ హీరోయిన్ అందుకొని అరుదైన ఘనత..!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎవరైనా వస్తారు .. కానీ చరిత్రను తిరగరాసే రికార్డ్స్ మాత్రం కొందరే అందుకోగలరు.. ఆ అరుదైన ఘనత అందుకుంది అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ . సీరియల్స్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న మృణాల్..సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది . రీసెంట్గా వచ్చిన హాయ్ నాన్న సినిమాతో మరో బిగ్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది .

త్వరలోనే విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. దీంతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుంటున్న మృణాల్ ఠాకూర్ కి సంబంధించిన ఒక వార్త నెట్టింట బాగా వైరల్ గా మారింది . ఒకే హీరోతో బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాల్లో నటించడం చాలా చాలా రేర్ రికార్డ్ . అయితే రీసెంట్గా అలాంటి ఘనత అందుకున్నింది ఈ బ్యూటీ.

ప్రభాస్ తో వరుసగా మూడు సినిమాలకు కమిట్ అయింది . దీంతో సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసింది . కల్కి సినిమాలో మృణాల్ ఠాకూర్ .. వన్ ఆఫ్ ద హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ది రాజా సాబ్ సినిమాలోని మృణాళ్ ఠాకూర్ వన్ ఆఫ్ ద హీరోయిన్ గా సెలెక్ట్ అయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. హను రాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కూడా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఫిక్స్ చేసుకున్నారట . ఇలా బ్యాక్ టు బ్యాక్ వరుసగా మూడు సినిమాలలోనూ ప్రభాస్ తో నటించబోతుంది. ఇప్పటివరకు ఈ రేర్ రికార్డ్ ఏ హీరోయిన్ కూడా అందుకోకపోవడం గమనార్హం..!