నా కూతురు నా నుంచి తప్పించుకుంది.. సంచలన పోస్ట్ షేర్ చేసిన రేణు దేశాయ్..?

పవన్ కళ్యాణ్ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె ఇండస్ట్రీలోనే మంచి పేరుని సంపాదించుకుంది. రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో మనకు తెలిసిందే. ముఖ్యంగా తన పిల్లలు గురించి ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇక తాజాగా మరోసారి రేణు దేశాయ్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తన ఇన్స్టాగ్రామ్ లో తన కూతురు ఆద్య పోస్టును షేర్ చేసింది..నా కూతురు ఆద్య ఒక సంవత్సరం నుండి ముక్కు కుట్టించుకోమంటే తప్పించుకుని తిరుగుతుంది. మొత్తానికి ముక్కు కుట్టించాను’ అంటూ ఓ వార్తను తన ఫాలోవర్స్ తో పంచుకుంది. దీనికి సంబంధించిన ఓ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక నటిగా ఒకప్పుడు మంచి గుర్తింపు తెచ్చుకున్నా రేణు దేశాయ్ ఇటీవలే ‘ టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో నటించి మరోసారి తనను తాను నిరూపించుకుంది.

ఇక ఆమె సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన రెండవ పెళ్లి పై చెప్పిన కామెంట్స్ అప్పుడు తెగ వైరల్ అయ్యాయి. ఆధ్యా కాలేజ్ కి వెళ్ళాక..పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను.నేను రెండో పెళ్లి చేసుకోవడం నా పిల్లలకు ఇష్టమే.ఆ విషయంలో వారు సంతోషంగానే ఉంటారు.మళ్లీ పెళ్లి చేసుకో అని అకీరా, ఆద్య చెబుతున్నారు’ అని కూడా తెలిపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.