మనసు చంపుకుని గోపీచంద్ కోసం ప్రభాస్ ఆ పని చేయబోతున్నాడా..? నిజమైన ఫ్రెండ్ షిప్ అంటే ఇదే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్లో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబెల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ మ్యాంచో హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న గోపీచంద్ జాన్ జిగిడి దోస్తులు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రభాస్ కెరియర్ మాత్రం ఓ రేంజ్ లో దూసుకుపోతూ ఉంటే .. గోపీచంద్ కెరీర్ మాత్రం ఎక్కువగా డిజాస్టర్స్ అందుకుంటుంది. ఈ క్రమంలోనే గోపీచంద్ కోసం ఎలాగైనా సరే హెల్ప్ చేయాలి అంటూ డిసైడ్ అయ్యాడు ప్రభాస్ .

కానీ ప్రభాస్ దగ్గర నుంచి ఎటువంటి హెల్ప్ తీసుకోవడానికి గోపీచంద్ సిద్దంగా లేడు . రీసెంట్గా గోపీచంద్ నటించిన సినిమా భీమా.. కన్నడ డైరెక్టర్ హర్ష తనదైన స్టైల్ లో ఈ సినిమాను డైరెక్టర్ చేశాడు . ఇప్పటికే లాంచ్ చేసిన టైటిల్ ఫస్ట్ లుక్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి . ఈ సినిమాపై భారీగానే ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు గోపీచంద్ అభిమానులు. మార్చి 8న గ్రాండ్గా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పై ఇంట్రెస్టింగ్ బజ్ నెలకొంది . భీమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను హనుమకొండ లోని కాకతీయ గవర్నమెంట్ కాలేజీలో రేపు సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించనున్నట్లు మూవీ టీం ప్రకటించింది . స్టైలిష్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది . అయితే ఈవెంట్ కి గోపీచంద్ బెస్ట్ ఫ్రెండ్ ప్రభాస్ గెస్ట్ గా రాబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. నిజానికి ప్రభాస్ ఇలా గెస్ట్లుగా వచ్చేది చాలా తక్కువ. కానీ గోపీచంద్ కోసం అలా రాబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. చూద్దాం దీనిపై చిత్ర బృందం ఎలాంటి అఫీషియల్ ప్రకటన ఇస్తుందో..?