బిగ్ బ్రేకింగ్: “ప్రభాస్ కల్కి సినిమాలో నేను నటిస్తున్న”.. టాప్ సీక్రేట్ రివీల్ చేసిన తెలుగు హీరో(వీడియో)..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా కల్కి 2898 ఏడి . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటించబోతుంది .

ఈ సినిమా ద్వారా జనాలకు కొత్త మెసేజ్ ఇవ్వబోతున్నాడు నాగ్ అశ్వీన్. దిశా పటాని – కమల్ హాసన్ – అమితాబచ్చన్ లాంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తూ ఉండడం గమనార్హం. ఈ సినిమాను వైజయంతి మూవీ బ్యానర్ పై అశ్విని దత్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు . ఇప్పటివరకు రిలీజ్ అయిన గ్లింప్స్… పోస్టర్ అభిమానుల్ని ఆకట్టుకున్నాయి.

రీసెంట్గా ఈ మూవీకి సంబంధించి ఒక టాప్ సీక్రెట్ ను రివిల్ చేశాడు టాలీవుడ్ స్టార్ హీరో రాజేంద్రప్రసాద్ . తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆయన స్టేజిపై మైక్ తీసుకొని డార్లింగ్ ఫాన్స్ ను ఆశ్చర్యపరిచారు . “నేను కూడా ఈ సినిమాలో నటించబోతున్నాను ” అంటూ అఫీషియల్ గా ప్రకటించాడు . అంతేకాదు మహేష్ బాబుతో కూడా ఓ సినిమా చేయబోతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు . ప్రజెంట్ రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు ..? అంటూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ నెలకొంది..!!