కోట్లాదిమంది ఫ్యాన్స్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి అని కోరుకుంటున్న.. తారక్ పాలిటిక్స్ కి దూరంగా ఉండడానికి కారణం అదేనా..?

కోట్లాదిమంది అభిమానులు ఏమో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి.. సీఎం పదవి చేపట్టాలి .. తాతను మించి పోయే స్థాయిలో అభిమానులకు జనాలకు సేవలు చేయాలి అని కోరుకుంటున్నారు . ఇప్పటికీ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి అనే జనాలు చాలామంది ఉన్నారు. రీజన్ ఏంటో తెలియదు కానీ ఎన్టీఆర్ మాత్రం అస్సలు పాలిటిక్స్ వైపు అడుగులు వేయడానికి ఇష్టపడడం లేదు .

మొదటి నుంచి తారక్ కి పాలిటిక్స్ అంటే చాలా చాలా భయం . అందుకే దూరంగా ఉండేవాడట . కానీ ఒకానొకసారి టిడిపిని ప్రమోట్ చేయడానికి మాత్రం ముందుకు వచ్చాడు . తాత పార్టీ అన్న ఇష్టం కారణంగా ప్రమోట్ చేశారు . ఆ టైంలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అప్పటినుంచి పాలిటిక్స్ కి దూరంగా ఉండటం ప్రారంభించారు . ఎంతలా అంటే ఆయనను అభిమానించి అన్నలా ఆరాధించే ఫ్యాన్స్ అడిగినా కూడా ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి రావడానికి ఇష్టపడడం లేదు.

ఒక్క విషయం కూడా పాలిటిక్స్ పై స్పందించడం లేదు. తన పని తాను చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. త్వరలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయ్.. అయినా కూడా దాని గురించి ఒక్క విషయం కూడా మాట్లాడడం లేదు . పలానా పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను . పలానా పార్టీకి సపోర్ట్ చేయడం లేదు . అసలు ఏ విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. తారక్ అంతే.. మొదటి నుంచి మొండివాడు తాను అనుకున్న పని తాను చేసే తీరుతాడు. ఇష్టముంటే ఎంత దూరమైన వెళ్లే తారక్ ఇష్టం లేకపోతే ఆ పనిని అస్సలు చేయడు అంటున్నారు నందమూరి అభిమానులు..!!