ఆ విషయాన్ని ప్రూవ్ చేయడానికి తెగ కష్టపడుతున్న చిరంజీవి ..మీరు గమనించారా..!!

ఎస్ మెగాస్టార్ చిరంజీవి కూడా తన సినిమాని తానే ప్రమోట్ చేసుకునే విధంగా మారిపోయాడా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి మనం చూస్తున్నాం . ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుంది..? ఎప్పుడు ఏ సినిమా ఫట్ అవుతుంది అని చెప్పలేని పరిస్థితి. మరీ ముఖ్యంగా కోట్లు బడ్జెట్ పెట్టిన సినిమా కూడా రూపాయి కూడా ప్రాఫిట్స్ రాకుండా అట్టర్ ప్లాప్ అయిపోతుంది .

అందుకే స్టార్ తమ సినిమాను తామే ప్రమోట్ చేసుకునే విధంగా మారిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా అదే విధంగా మారిపోయారు. ఆయన లాస్ట్ గా నటించిన సినిమా భోలా శంకర్. ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత నటించే సినిమా ఫ్లాప్ అవ్వకూడదు అనుకున్న చిరంజీవి నెక్స్ట్ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు .వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్నాడు .

ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడుతున్నాడు . ఈ సినిమా జనవరి 10న సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నట్లు కూడా ప్రకటించేశాడు . రీసెంట్ గా ఈ సినిమాకి ఆయనే ప్రమోషన్ స్టార్ట్ చేశాడు . మెగాస్టార్ చిరంజీవి త్రిష ఇప్పటివరకు కంపోజ్ చేసిన మ్యూజిక్ మొత్తం విన్నారు దానికి సంబంధించిన ఒక పిక్చర్ ని షేర్ చేస్తూ సినిమాకి మంచి పబ్లిసిటీ ఇచ్చారు. నిజానికి ఇలాంటి పబ్లిసిటీ స్టార్ హీరోస్ దగ్గర నుంచి మనం చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. చిన్నాచితక హీరోలే ఇలా పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు. కానీ మెగాస్టార్ లాంటి చిరంజీవి కూడా ఇలా ప్రతిదానికి విశ్వంభర ని ప్రమోట్ చేసుకుంటూ ఉండడం అభిమానులకి ఆశ్చర్యకరంగా ఉంది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Trish (@trishakrishnan)