ఓరి దేవుడోయ్..ఆ హీరో పేరు చెప్పి .. దీపికా పదుకొనే ఎన్ని వందల కోట్లు సంపాదించిందో తెలుసా..?

ఎస్ ఇప్పుడు ఇదే న్యూస్ టాలీవుడ్ – బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ జాక్ పాట్ ఆఫర్స్ ఎలా కొడుతున్నారో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఒక్క పాన్ ఇండియా స్టార్ట్ నటించే అవకాశం అందుకుంటే చాలు ఆ సినిమాకి వచ్చే రెమ్యూనరేషన్ కన్నా ఆ సినిమా కన్నా ముందే అంతకు డబల్ రేంజ్ లో సంపాదించేసుకుంటున్నారు.

అది ఎలాగా..? అని అనుకుంటున్నారా ఇలాగే .. హీరోయిన్ దీపికా పదుకొనే కి తెలివితేటలు ఎక్కువ అని అందరూ అంటూ ఉంటారు. ఈసారి అది బాగా ప్రూవ్ చేసేసింది . దీపికా పదుకొనే గ్లోబల్ వైడ్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్న బ్యూటీ..అయినా రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం లిమిట్స్ ఎప్పుడో క్రాస్ చేయదు . కాగా రీసెంట్గా దీపికా “కల్కి “సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే .

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమాకి దీపిక రెమ్యూనరేషన్ కూడా భారీగానే ఛార్జ్ చేసిందట. అయితే ఈ సినిమాకి ఇచ్చే రెమ్యూనరేషన్ కన్నా డబల్ ట్రిపుల్ కాదు ఏకంగా ఆరు రెట్లు ప్రభాస్ పేరు చెప్పి సంపాదించుకునేసింది అంటూ కోలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ తో సినిమా చేస్తుంది అని తెలియగానే ఆమెకి పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయమంటూ ఆఫర్స్ వచ్చాయట . అంతేకాదు ఈ సినిమా పుణ్యమాంటి మరికొన్ని భారీ సినిమాలలో కూడా ఆఫర్ వచ్చాయి. ఈ విధంగా దాదాపు ఆమె కొన్ని వందల కోట్లు సంపాదించేసింది అంటున్నారు జనాలు. ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది..!!