దేవుళ్ళు మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ పాప ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది. .?!

ప్రస్తుతం టాలీవుడ్ లో దర్శకుడు రాజమౌళికి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన డైరెక్షన్లో సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అలా గతంలో ఎన్నో వైవిధ్య సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు కోడి రామకృష్ణ.. సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూసేవారు. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే కచ్చితంగా ఏదో కంటెంట్ ఉంటుందనే ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేసేవారు. అలా అప్పట్లో ఆయన దర్శకత్వంలో వ‌చ్చిన సినిమాలలో దేవుళ్ళు సినిమా ఒకటి. ఇక ఈ సినిమా 2000లో రిలీజై భారీ సక్సెస్ సాధించింది. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాలో మాస్టర్ నందన్, బేబీ నిత్య ప్రధాన పాత్రలో మెప్పించారు.

ఈ ఇద్దరు చిన్నారులు తమ‌ తల్లిదండ్రులు కలవాలని ఉద్దేశంతో వారికి చెప్పకుండా పుణ్యక్షేత్రాలకు కష్టపడి తిరుగుతూ ఉంటారు. వారు ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నారు. దేవుళ్ళు ఎలాంటి సహాయం అందించారు. అనే నేపథ్యంతో కథను రూపొందించారు. ఇక ఈ సినిమాలో బేబీ నిత్య తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం బేబీ నిత్యా ఎలా ఉందో.. ఏం చేస్తుందో ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ చిన్నది హీరోయిన్గా మారిపోయింది.

తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలో నటించిన నిత్య.. తర్వాత హీరోయిన్ గా మారి కొన్ని సినిమాల్లో మెప్పించింది. అలా ఆమె నటించిన సినిమాల్లో నువ్వు తోపురా, పిట్టకథ‌, వాంటెడ్ పండుగాడు లాంటి సినిమాలు ఉన్నాయి. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించిన ఈ చిన్నది.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ‌ను ఆకట్టుకుంటుంది. అందాలతో కవ్విస్తూ భారీ క్రేజ్ ను సంపాదించుకుంటుంది. అలా నిత్య పోస్ట్ చేసే ప్రతి ఫోటోకు నెట్టింట తెగ క్రేజ్ ఉంటుంది. దీంతో తాజాగా ఈమెకు సంబంధించిన లేటెస్ట్ పిక్స్, వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి.