ఎంతో అన్యోన్యంగా ఉన్న ఉపాసన – చరణ్ లు కూడా.. ఆ విషయం కారణంగా ఇప్పటికీ గొడవపడతారా..?

మెగాస్టార్ వన్ అండ్ ఓన్లీ సన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండస్ట్రీలో ఎంత హై స్థానంలో ఉన్నాడో మనకు తెలిసిందే. గ్లోబల్ ఇమేజ్ గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రెసెంట్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. రీసెంట్ గానే గేమ్ ఛేంజర్ అనే సినిమా షూట్ ను కంప్లీట్ చేసుకున్నాడు. కాగా మరోసారి సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 2 సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు అన్న ప్రచారం కూడా జరుగుతుంది.

సినిమాలపరంగా ఎంత బిజీగా ఉన్నా సరే రామ్ చరణ్ వ్యక్తిగతంగా కూడా తన ఫ్యామిలీకి అంతే టైం ఇస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు . రీసెంట్గా వైజాగ్ బీచ్ లో ఉపాసన – క్లింకార – రామ్ చరణ్ ఎలా సందడి చేశారో మనకు తెలిసిందే. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన పిక్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి ..వైరల్ అయ్యాయి. అయితే చూడడానికి చాలా చక్కగా అన్యోన్యంగా ఉన్న ఈ జంట .. మధ్యలో కూడా గొడవలు వస్తాయి అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

రామ్ చరణ్ – ఉపాసనలు కూడా బాగా గొడవపడతారట. రామ్ చరణ్ ..మెస్సి మెసీ.. ఉపాసన చాలా స్ట్రిక్ట్.. క్లీన్ అండ్ గ్రీన్ టైప్ . ఇద్దరు కూడా ఇంట్లోని పలు విషయాలు కారణంగా గొడవలు పడుతూనే ఉంటారు . ఎక్కడ షూస్ అక్కడ ఎక్కడ బట్టలు అక్కడ వేస్తే ఉపాసనకు నచ్చదట. రామ్ చరణ్ కి మొదటి నుంచి అది అలవాటు అట . పెళ్లయి వేలకోట్ల ఆస్తులు ఉన్నా సరే ఉపాసన – చరణ్ కూడా సింపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ల గొడవలు పడతారు అన్న విషయం ఇప్పుడు వైరల్ గా మారింది..!!