మూవీ ఫస్ట్ పార్ట్ వరకు హీరోలకు అసలు డైలాగ్స్ లేని టాలీవుడ్ సినిమాల లిస్ట్ ఇదే..!!

ఏదైనా ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు తమ అభిమాన హీరో సినిమా ఎలా ఉంటుందో.. ఆయన నటన, డైలాగ్స్, ఫైట్ సీన్స్ అన్నీ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలవుతుంది. ఆ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ తమ ఫ్యాన్స్ అంతా ఆత్రుత‌గా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఓ సినిమా రిలీజై ధియేటర్ కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ మొత్తం అసలు హీరో ఎలాంటి డైలాగ్ చెప్పకపోతే ఫ్యాన్స్ ఆశ‌లు ఆవిరౌతాయి. సినిమాపై ఆసక్తి పోతుంది. కానీ అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాకుండానే మన టాలీవుడ్ టాప్ హీరో చాలామంది ఇప్పటివరకు డైలాగ్స్ లేకుండా కేవలం తమ నటనతోనే ఫస్ట్ హాఫ్ అంతా నటించి ప్రేక్షకులను మెప్పించారు.

అలా ఫ‌స్ట్ హ‌ఫ్ డైలాగ్స్ లేకుండా సినిమాలతో సక్సెస్ కొట్టి.. రికార్డులు సాధించిన స్టార్ హీరోలు ఎవరో.. ఆ సినిమాలు ఏంటో.. ఒకసారి చూద్దాం. అలా మొట్టమొదటిసారి ఫస్ట్ హాఫ్ అంత డైలాగ్స్ లేకుండా నటించిన హీరో సూపర్ స్టార్ కృష్ణ. ఇద్దరు మోసగాళ్లు సినిమాలో ఈయన టార్జాన్ పాత్రలో నటించి మెప్పించారు. అసలు టార్జాన్ పాత్రకు డైలాగ్స్ ఉండవు. కేవలం వారు చేసే చర్యలతోనే తమ భావాలను వ్యక్తం చేస్తారు. ఇక అలానే ఎన్టి రామారావు కూడా టార్జాన్ పాత్రలో నటించారు. 1978లో రాజపుత్ర రహస్యం అనే సినిమాలో ఈయన టార్జాన్‌గా కనిపించాడు. అయితే ఈ సినిమా మొదటి భాగం మొత్తం పూర్తిగా మాటలు లేకుండా కేవలం నటనతోనే మెప్పించారు. ఈ సినిమాకు ఎస్‌డి లాల్ డైరెక్షన్ వహించగా.. హీరోయిన్గా జయప్రద మెప్పించింది.

ఇక మెగాస్టార్ చిరంజీవి అడవి దొంగ సినిమాలో రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో నటించి మెప్పించాడు. 1985లో రిలీజ్ అయిన ఈ సినిమాలో చిరు టార్జాన్ పాత్రలో నటించాడు. ఇక వీరిద్దరి కాంబోలో ఇది మొదటి సినిమా. ఈ సినిమాలో చిరంజీవి జంటగా రాధ నటించారు. ఇక చిరంజీవి కెరీర్‌లోనే ఆయన నటించిన ఏకైక టార్జాన్ సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ నటించిన పై రెండు సినిమాలు జానపద నేపథ్యంతో తెరకెక్కితే.. కేవలం చిరంజీవి నటించిన అడవి రాముడు మాత్రమే సాంఘిక నేపథ్యంలో రూపొందింది. ఇలా వీరు ముగ్గురు టార్జాన్ పాత్రలో నటించి మెప్పించారు. ఈ మూడు సినిమాల్లో ఎటువంటి డైలాగ్స్ లేకుండానే మొదటి హాఫ్ అంత గడిచిపోతుంది. కాగా ఈ మూఈల త‌ర్వాత ఇప్పటివరకు వచ్చిన మరే సినిమా ఫస్ట్ ఆఫ్ అంత మాటలు లేకుండా తెర‌కెక్కలేదు.