అప్పుడు నాగార్జున-బాలయ్య..ఇప్పుడు మహేశ్ బాబు.. ఆ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కారణం వాళ్ళే..!

సినిమా ఇండస్ట్రీ అంటేనే మాయాలోకం.. రంగుల ప్రపంచం.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరో గెస్ చేయలేరు. చాలామంది స్టార్స్ కూడా అలా బలైపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్లలో ఒకరే ఇప్పుడు మన మహేష్ బాబు. పాపం గుంటూరు కారం సినిమా విషయంలో ఆయనను ఎలా ట్రోల్ చేశారో జనాలు మనం చూసాం . మరీ ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అయితే ఏకీపారేశారు . ఇన్నాళ్లు ఆయన కష్టపడి సంపాదించుకున్న పరువు మర్యాదలు గంగలో కలిపేశారు.

కాగా రీసెంట్గా గుంటూరు కారం రిజల్ట్ పై డైరెక్టర్ ఎస్.వి.కృష్ణారెడ్డి స్పందించారు. ” సినిమాని తెరకెక్కించేటప్పుడు కథను నమ్ముకుని తెరకెక్కించాలి అని.. హీరో ని నమ్ముకుని తెరకెక్కిస్తే కథలు ప్లాప్ అవుతాయి అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు”. గతంలో ఆయన తెరకెక్కించిన శుభలగ్నం – మావిచిగురు – యమగోల సినిమాలు కేవలం కథను నమ్ముకుని తెరకెక్కించానని అందుకే అవి హిట్ అయ్యాయని ..బాలకృష్ణ -నాగార్జున తో తెరకెక్కించిన వజ్రం , టాప్ హీరో సినిమాలు ఫ్లాప్ అయ్యాయని ..

అది నేను హీరో ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ చేసుకుని తెరకెక్కించానని.. అందుకే ఆ సినిమాలు నాకు నిరాశ మిగిల్చాయని చెప్పుకొచ్చారు . అంతేకాదు గుంటూరు కారం సినిమా విషయంలో కూడా అదే జరిగింది అని మహేష్ బాబు క్రేజ్ ని మైండ్ లో పెట్టుకొని తెరకెక్కిస్తే ఇలానే ఉంటుంది అని .. అదే కథను నమ్ముకొని తెరకెక్కించుంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేదని కామెంట్స్ చేశారు . ప్రెసెంట్ ఆయన మాటలు వైరల్ అవుతున్నాయి..!!