‘ ఎన్టీఆర్ ‘ బయోపిక్ ఫ్లాప్ అవ్వడానికి కారణం బాలయ్యేనా.. అలా చేసి ఉంటే పక్కా హిట్ అయ్యేదా..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలయ్యకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్‌లో విపరీతమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న ఏకైక హీరో బాలయ్య. ముఖ్యంగా ఆయన డైలాగ్స్ చెప్పే టైమ్‌లో థియేటర్స్ లో విజిల్స్ మెత మేగిపోతుంది. కాగా నందమూరి నటసార్వభౌమ ఎన్టీఆర్ న‌ట వార‌స‌త్వాని పునికి పుచ్చుకొని తండ్రికి తగ్గ తనయుడిగా కీర్తిని పెంచిన ఒకే ఒక్క హీరో బాలయ్య. ఈయన చేసిన ప్రతి సినిమా అప్పట్ల సెన్సేషన్ క్రియేట్ చేసేది. చాలా సినిమాలు చిరంజీవికి పోటీగా నిలబడి పై చేయి సాధించిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు చిరంజీవి తన సినిమాలతో స‌స‌క్స‌స్‌ సాధించేవాడు.

ఇలా వీళ్ళిద్దరి మధ్యన ఒక టఫ్ అండ్ హెల్దీ కాంపిటీషన్ నడిచేది. ఇది ఇలా ఉంటే బాలయ్య నాన్నగారైన ఎన్టీఆర్ బయోపిక్ ను తీయడానికి దర్శకుడుగా ముందు తేజను అనుకున్నారు. అప్పటికే తేజ నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సక్సెస్ సాధించి మంచి ఫామ్ లో దూసుకుపోతున్నాడు. అయితే స్క్రిప్ట్ స్టేజ్ లో ఉన్న క్లాష‌స్ కారణంగా తేజ ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. దాంతో అప్పటికే బాలయ్య బాబుతో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చేసిన క్రీష్‌ డైరెక్టర్గా ఎంపిక‌య్యాడు. ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్ట్‌లుగా రిలీజ్ అయిన అవి రెండు పెద్దగా సక్సెస్ కాలేదు. వీటికి కారణం ఎన్టీఆర్ కి సంబంధించిన చాలా విషయాలను అందులో సరిగ్గా చూపించకపోవడమే.

అందువల్లే ఆ సినిమా ఆర్టిఫిషియల్ గా ఉంది అంటూ అప‌ట్లో ప‌లు కామెంట్స్ వినిపించాయి. అయితే ఎన్టీఆర్ బయోపిక్ స్టోరీలా అయితే లేదు అనే ఉద్దేశంతోనే ప్రేక్షకులు దాన్ని రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఇక తేజ కూడా స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడు.. ఈ సినిమా స్టోరీ ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది.. రియల్టీగా లేదు మనం సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేద్దామంటూ బాలయ్యకు చెప్పడ‌ట‌. అయితే బాలయ్యకి ఆ మార్పులు నచ్చకపోవడంతో.. ఇద్దరి మధ్యలో చిన్న గొడవ జరిగిందని.. ఆ సినిమా నుంచి తేజ అందుకే తప్పుకోవాల్సి వచ్చిందని అప్పట్లో మీడియాలో తెగ వార్తలు వినిపించాయి. ఇక దీంతో తేజ చెప్పినట్లుగా స్టోరీని తెరకెక్కించి ఉంటే సినిమా ఖచ్చితంగా సక్సెస్ అయి ఉండేది అంటూ పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.