“సుమకి షోలు తగ్గిపోవడానికి కారణం వాళ్లే”.. ఓపెన్ గా చెప్పేసిన రాజీవ్ కనకాల..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ సుమకి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఎలాంటి షోస్ నైనా సరే అవలీలగా హోస్ట్ చేయగలరు . రీసెంట్ గా ఆమె కొడుకు రోషన్ కనకాల కూడా సినిమా ఇండస్ట్రీ లోకి హీరోగా వచ్చాడు . కాగా ప్రజెంట్ పలు షోలతో బిజీగా ముందుకు వెళ్తున్న యాంకర్ సుమ యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ముందుకు దూసుకెళ్లిపోతుంది.

కాగ రీసెంట్ ఇంటర్వ్యూలో యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల మాట్లాడుతూ ..సుమకి షోస్ తగ్గడం పై సంచలన కామెంట్స్ చేశారు . దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. “సుమ కెరియర్ స్టార్టింగ్ నుంచి బాగా కష్టపడుతుంది ..తాను నమ్మిన వర్క్ పట్ల చాలా డెడికేషన్ గా ఉంటుంది . బాగా సంపాదిస్తుంది అని.. ఎప్పుడూ కూడా పిల్లల్ని చూసుకోకుండా లేదు ..ఒక పక్క కెరియర్ మరొకపక్క పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చింది . ఎప్పుడైనా ఏదైనా షోస్ లేట్ అవుతున్నాయి అని తెలిస్తే పిల్లలను తన వెంట తీసుకెళ్ళి పోతుంది “..

“చాలా బాగా మేనేజ్ చేస్తుంది. ఒకప్పుడు సుమకి చాలా ఎక్కువ షోస్ ఉండేటివి .. ఇప్పుడు సుమకి షోస్ తగ్గిపోయాయి ..అయితే ఆ షోస్ తగ్గడానికి కారణం పిల్లలే .. వాళ్లతో టైం స్పెండ్ చేయడానికి తగ్గించుకుంది.. యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంది “అంటూ చెప్పుకొచ్చాడు . రాజీవ్ కనకాల ఫ్యామిలీ విషయాలను ఇలా ఓపెన్ గా చెప్పేయడం పట్ల రాజీవ్ కనకాల సిన్సియారిటీ డెడికేషన్ ను ప్రశంసిస్తున్నారు అభిమానులు..!!