శర్వానంద్ తో రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసిన ఆ హీరోయిన్.. బొమ్మ సూపర్ హిట్ అంటున్న ఫ్యాన్స్..!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. శర్వానంద్ హీరోగా శ్రీరామ్ దర్శకత్వంలో తాజాగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మనమే వర్కింగ్ టైటిల్తో వస్తున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇక శర్వానంద్ నెక్స్ట్ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శర్వానంద్ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా మహానటి ఫేమ్ మాల్విక నాయర్ నటించిన లూజర్ తో మంచి పేరు ప్రఖ్యాతులు పొందిన ఈ ముద్దుగుమ్మ శర్వానంద్ తో నటిస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని ప్రేక్షకులు సైతం భావిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో లేడీ లీడ్ రోల్ కోసం మాళవిక ను సంప్రదించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఈ ముద్దుగుమ్మ సైతం ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ మూవీని ప్రొడక్షన్ నెంబర్ 1 లో నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీకి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయి.