పవన్ సినిమా ర్రీ రిలీజ్ తో చిక్కుల్లో పడ్డ ” యాత్ర 2 “… పెద్ద ప్లానేగా…!

టాలీవుడ్ లో గత ఏడాదిలో అలా స్టార్ట్ అయి ఊపందుకున్న రీ రిలీజ్ ట్రెండ్ ప్రస్తుతం కూడా కొనసాగుతుంది. ఇక పవన్ కళ్యాణ్ మరియు తమన్నా హీరో, హీరోయిన్గా నటించిన మూవీ ” కెమెరామెన్ గంగతో రాంబాబు ” మూవీ రీ రిలీజ్ ట్రైన్ లో చేరనుంది. ఇంకా పూరి జగన్నాథ్ తరిగేక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 7 కి లాక్ అయ్యింది.

ఇక ఈ మూవీ రీ రిలీజ్ కోసం ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీ రిలీజ్ సమయంలో రాబోతున్న మరో సినిమా ” యాత్ర 2 “. ఇక ఈ సినిమాకి పోటీగా తేవడం కోసమే పవన్ కళ్యాణ్ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి దీంతో యాత్ర 2 చిత్ర బృందం వెనక్కి తగ్గుతారో లేదో చూడాలి మరి.

ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ సినిమాతో యాత్ర 2 కనుక అదే తేదీన రిలీజ్ అయితే దారుణమైన అపజయాన్ని చవిచూడాలని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కెమెరామెన్ గంగతో రాంబాబు సూపర్ హిట్ అయింది. అదేవిధంగా పవన్ ఫ్యాన్స్ తో పాటు ఎందరో ఈ సినిమా నీ చూసేందుకు తరలి వెళ్తారు. ఇందులో భాగంగానే యాత్ర మూవీ భారీ డిజాస్టర్ అవుతుందని చెప్పొచ్చు.