రోజు ఉదయాన్నే డ్రై ఫ్రూట్స్ తో ఎండుద్రాక్ష తింటే ఇంత ప్రమాదమే.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

ప్రస్తుతం ఉన్న బిజీ స్కెడ్యూల్‌లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పోషకాలతో కూడిన ఆహారాన్ని డైట్ లో చేర్చుకునేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే పొద్దున్నే లేగవగానే గుప్పెడు మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మంచిదని భావిస్తున్నారు. వాటిలో బాదం, పిస్తా, వాల్ నట్స్‌, ఖర్జూర, ఎండుద్రాక్ష, ఆంజీర్‌ లాంటి డ్రైఫ్రూట్స్ మార్నింగ్ డైట్ లో కచ్చితంగా ఉంచుతున్నారు. ఆరోగ్యపరంగా డ్రై ఫ్రూట్స్ అపారమైన ప్రయోజనాన్ని చేకూరుస్తాయని అందరికీ తెలుసు.

Wooden bowl with mixed nuts on rustic table top view. Healthy and nutrient food and snack.

అదే విధంగా పలు అనారోగ్యాల సమస్యలకు చెప్పు పెడతాయి. రోజంతా చురుక్గా ఉండడానికి డ్రై ఫ్రూట్స్ ఎంతగానో సహకరిస్తాయి. అయితే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉదయం పూట తినడానికి సరైనవి కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎండుద్రాక్ష ఉదయం పూట తీసుకోకూడదట. ఎన్ని ర‌కాల‌ విటమిన్స్, డైటరీ ఫైబ‌ర్‌, పొటాషియం, మెగ్నీషియం అలా ఆరోగ్యానికి మేలు చేస్తే పోషకాలు ఎన్నో ఉంటాయి. క‌నుక‌ నిత్యం ఎండుద్రాక్షను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఎండు ద్రాక్షలో ఐరన్ సమృధ్ధిగా లభిస్తుంది.

అందువల్ల రోజు ఎండుద్రాక్షను తీసుకుంటే రక్తహీనత నుంచి బయటపడవచ్చు. ఎండు ద్రాక్షలో ఉంటే ఫైబర్.. డైజెస్టివ్ సిస్ట‌మ్‌ను చురుకుగా మెరుగుపరిచి.. మలబద్ధక సమస్యను తరిమికొట్టడంలో సహకరిస్తుంది. నిత్యం ఎండు ద్రాక్ష తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కరిగి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లో ఉంటుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్కు కూడా తగ్గుతుంది. స్కిన్ హెల్తీగా, యంగ్ గా ఉండడానికి సహకరిస్తుంది. ఇలా ఎండు ద్రాక్ష వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

అయినప్పటికీ ఉదయం పూట డ్రైఫ్రూట్స్‌లో ఎండు ద్రాక్షను తీసుకోకపోవడమే మంచిదట‌. ఒకవేళ కచ్చితంగా.. రోజు ఎండుద్రాక్షను తినాలి అనుకుంటే ఓట్‌మీల్‌, స్మూతి, సలాడ్స్‌లో..ఇలా ప‌లు ఆహారాల్లో కలిపి తీసుకోవడం వల్ల మనకు మరింత మెరుగవుతుంది. అలాగే డిహైడ్రేట్ చేసుకోని తీసుకోవ‌డం కూడా చాలా మంచిది.అంటే నైట్ అంతా వాటర్ లో నాని పెట్టి ఉదయాన్నే తాగవచ్చు. వాటర్ లో ఇలా నానబెట్టి తాగడం వల్ల ఎండు ద్రాక్షలో చక్కెర మరియు ప్రెజర్వేటివ్‌లు తగ్గి.. హెల్త్ ను మెరుగుపరుస్తాయి.