షాకింగ్ అప్డేట్: కన్నప్ప మూవీలో ‘ పార్వతి ‘ గా ఆ కాంట్రవర్షియల్ బ్యూటీ.. అసలు ఊహించని ట్విస్ట్..

మంచు విష్ణు ప్రొడ్యూసర్ గా.. లిడ్ రోల్ లో నటిస్తూన్న‌ మూవీ కన్నప్ప. రూ.100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ కూడా ఒక పార్ట్ కావడం విశేషం. కన్నప్ప సినిమాలో ప్రభాస్ శివుడు గా కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వైర‌లైన‌ సంగతి తెలిసిందే. దీనిపై మేకర్స్ కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. అయితే ప్రభాస్ శివుడు కాగా పార్వతి పాత్ర ఎవరు చేస్తున్నారని ఆసక్తి ఎప్పటినుంచో ప్రేక్షకుల్లో మొదలైంది. మొదట్లో కన్నప్ప సినిమాలో ప్రభాస్ శివుడిగా చేస్తుండగా.. పార్వతి దేవి పాత్రలో ఆయన సరసన నయనతార నటిస్తుందంటూ వార్తలు వినిపించాయి.

Prabhas: శివుడి రూపంలో ప్రభాస్ లుక్ అదిరిపోయింది.. సోషల్ మీడియాను షేక్  చేస్తోన్న ఫోటోస్.. - Telugu News | Actor Prabhas AI Generated look of Lord  Shiva photos goes viral telugu cinema ...

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ పాత్రకు నయనతారను కాకుండా బాలీవుడ్‌కు చెందిన ఓ కాంట్రవర్షియల్ బ్యూటీని సెలెక్ట్ చేసుకున్నారట. ఇంతకీ ఆమె ఎవరో ఒకసారి చూద్దాం. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కంగనా రనైత్. సినిమాల్లో కంటే కాంట్రవర్షియల్ కంటెంట్ తో ఎక్కువగా పాపులర్ అయిన కంగనా తెలుగులో కేవలం ఒకే ఒక్క సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా ప్రభాస్ సరసన నటించడం విశేషం. ప్రభాస్ తో ఏక్ నిరంజన్ సినిమాలో నటించిన కంగన.. మరోసారి ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత ప్రభాస్ తో టాలీవుడ్ మూవీలోనటించేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా.. కంగనా రనౌత్ పార్వతిగా కనిపించబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Is Kangana Ranaut getting married? Actress reveals

ఇక ఈ సినిమాను మంచు విష్ణు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ఏడాది దసరాకు రిలీజ్ చేసేలా మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. కాగా ప్రస్తుతం ప్రభాస్ – కంగనా జంటగా నటిస్తున్నారని వార్తలు వైరల్ అవ్వడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. పోయి పోయి ప్రభాస్ పక్కన ఆ హీరోయిన్ ను ఎంచుకున్నావ్ ఏంటి విష్ణు.. అంతకంటే మంచి అమ్మాయి నీకు దొరకలేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.