విరాట్ కోహ్లీ కొడుకు “అకాయ్” పేరుని ఎలా పెట్టారో తెలుసా..? దాని అర్ధం ఇదే..!

టీమిండియా క్రికెటర్.. విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఓ షూట్లో కలిసి నటించిన వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ మొదలైంది . ఆ తర్వాత ఆ ఫ్రెండ్ షిప్ ప్రేమగా మారి ఆ తర్వాత భార్యాభర్తల బంధం గా మారిపోయింది. ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్నా సరే వన్ ఆఫ్ ద టాప్ క్యూట్ రొమాంటిక్ కపుల్ గా బాగా పాపులారిటీ దక్కించుకున్నారు.

విరాట్ కోహ్లీ – అనుష్క శర్మకు వామిక అనే ఒక పాప ఉంది . అంతేకాదు అనుష్క శర్మ రెండోసారి గర్భం దాల్చినట్లు అందరికీ తెలిసిందే. కొద్ది గంటల క్రితమే అనుష్క శర్మ పండు లాంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది . ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది విరాట్ కోహ్లీ అనుష్క శర్మ జంట. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మరో కింగ్ కోహ్లీ వచ్చాడు అంటూ విషెస్ అందిస్తున్నారు.

సోషల్ మీడియా వేదికగా బిడ్డ పేరు ని కూడా అనౌన్స్ చేశారు. “ఆ దేవుడి ఆశీస్సులతో బేబీ బాయ్ పుట్టాడు ..అనుష్క శర్మ బేబీ హ్యాపీగా ఉన్నారు. హెల్తీగా ఉన్నారు “అంటూ చెప్పుకొచ్చాడు విరాట్. అంతేకాదు బేబీ పేరు “అకాయ్” అంటూ రివిల్ చేశారు . దీంతో విరాట్ అభిమానులు అకాయ్ అంటే అర్థం ఏంటి..? అంటూ సెర్చింగ్ చేస్తున్నారు . అకాయ్ అంటే అర్థం దృఢమైన శరీరం కలవాడు అనే విషయాన్ని తెలుసుకున్నారు . టర్కిష్ లో “అకాయ్” అంటే ఉదయించే సూర్యుడు అని అర్థం . అంతేకాదు అనుష్క శర్మలో “అ” విరాట్ కోహ్లీ లో “క” ని మిక్స్ చేస్తూ అకాయ్ అంటూ పెట్టారట . ప్రసెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!